గత కొంతకాలంగా టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలకు ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల కాకుండానే విదేశాలలోని కొందరు ఆ ట్రైలర్ ను తాము ఇప్పటికే చూసాము అంటూ అనేక ఆసక్తికర టిట్స్ చేయడం అలవాటుగా మారింది. ఇప్పుడు ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తూ దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు ‘సైరా’ ట్రైలర్ ను తాను ఇప్పటికే చూసాను అంటూ ట్విట్ చేయడమే కాకుండా ఒక కొత్త సంచలనానికి తెర తీసాడు. 

వాస్తవానికి ‘సైరా ట్రైలర్ ను ఈనెల 18న జరగబోతున్న ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పటికే రెడీ అయిన ఆ ట్రైలర్ ను తాను చూసాను అని చెపుతూ ఈ క్రిటిక్ ఒక రివ్యూ కూడ ఇచ్చేసాడు. 

‘సైరా థియేట్రికల్ ట్రైలర్ ఇప్పుడే చూశాను. ఫెంటాస్టిక్.. మైండ్ బ్లోయింగ్... మెగాస్టర్ చిరంజీవి మనసు దోచేశాడు. ట్రైలర్ అంతా ఆయన ప్రతిభే కనిపిస్తోంది. హీ ఈజ్ స్టోలెన్ ది షో. అద్భుతమైన స్టార్ కాస్ట్ కుదిరింది. `సైరా` షూర్ షాట్ బ్లాక్ బస్టర్ కావడం ఖాయం` అంటూ తన తొలి ట్విట్ రివ్యూ ఇచ్చాడు. దీనితో ఈ రివ్యూ అంచనాలను  పెంచుతోంది.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఉమైర్ సంధు  ట్రాక్ రికార్డును దృష్టిలో పెట్టుకుని మెగా అభిమానులు ఈ రివ్యూ పై భయపడి పోతున్నారు. ఇతడు లేటెస్ట్ గా ‘సాహో’ విడుదలకు ముందు కూడ ఇలాగే చెప్పాడు. అదేవిధంగా పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘అజ్ఞాతవాసి’ మహేష్ ‘బ్రహ్మోత్సవం’ మూవీలు బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ముందుగా ఇతడు రివ్యూలు ఇచ్చాడు. ఈ మూవీలు అన్నీ భయంకరమైన ఫ్లాప్ లుగా మారాయి. దీనితో ఇతడు హిట్ అంటే చాలు ఆ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఈ విషయాలను గుర్తుకు చేసుకుని ‘సైరా’ ఉమైర్ సంధు నెగిటివ్ సెంటిమెంట్ ఏమిటి అంటూ మెగా అభిమానులు ఖంగారు పడుతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: