నయనతార టాలెంటెడ్ హీరోయిన్.  అంతేకాదు.. సౌత్ లో ఇప్పుడు ఆమె టాప్ హీరోయిన్ కూడా.  వరసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరోయిన్లలో ఆమె ఒకరు.  నయనతార సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  ప్రతి పాత్రను అవలీలగా చేస్తుంది.  ప్రస్తుతం ఆమె సినిమాలకు కోలీవుడ్ లో భారీ డిమాండ్ ఉన్నది.  ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే..మరోవైపు లేడీ ఓరియేంటేడ్ సినిమాలు చేస్తున్నది.  


నయనతార ఉన్నంత బిజీగా సినిమా ఇండస్ట్రీలో మరో హీరోయిన్ లేదనడంలో సందేహం అవసరం లేదు.  ఇప్పుడు ఈ టాప్ హీరోయిన్ మరో కొత్త సినిమా చేస్తున్నది.  అదే నేట్రికన్.  ఈ సినిమా నిన్ననే ప్రారంభం అయ్యింది.   నేట్రికన్ అంటే అంధురాలు అని చెప్పుకోవచ్చు.  దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.  ఈ పోస్టర్ చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి.  


ఈ పోస్టర్ లో నయనతార చేతి వేళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి.  పోస్టర్ పైన బేడీలు, ఆ పక్కనే ఒక చండ్రకోలు ఉన్నది.  చేతి వేళ్ళకు పక్కన నోటిని కట్టేసే ఓ సాధనం ఉన్నది.  బేడీలు, ఆ చండ్రకోలు, నోటికి కట్టేసే సాధనం ఈ మూడింటిని మాములుగా బయట ఎక్కడ వాడారు.  వీటిని పోర్న్ కోసం వినియోగిస్తారు.  పోర్న్ సినిమాల్లో వీటి అవసరం ఉంటుంది.  


ఈ సినిమాకు వాటికీ సంబంధం ఏంటి అన్నది తెలియాలి.  నయనతార ఎలాంటి సినిమా చేసినా.. అందులో తప్పనిసరిగా మెసేజ్ ఉంటుంది.  ఈ  నేట్రికన్ లో కూడా అలాంటి మెసేజ్ తప్పకుండా ఉండే ఉంటుంది.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పొచ్చు.  రౌడీ పిక్చర్స్ పతాకంపై మిలింద్ రా దర్శకత్వం వహిస్తున్నారు.  ఇది నయనతారకు 65 వ సినిమా కావడం విశేషం.  ఇదే టైటిల్ తో 1981లో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వచ్చింది.  అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  ఇప్పుడు అదే టైటిల్ తో నయనతార సినిమా తెరకెక్కుతుండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: