నిన్న జరిగిన ‘వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ నోటివెంట పవన్ కళ్యాణ్ ప్రస్తావన రావడంతో పవన్ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోయారు. తాను ఈ మధ్య పవన్ కళ్యాణ్ ను కలిసిన విషయం వాస్తవం అని చెపుతూ అయితే అది పవన్ నటించబోయే సినిమాలకు సంబంధించిన కథ గురించి కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. 

పవన్ ను తాను ఎప్పుడు కలిసినా ఎక్కువ సమయం తన గురించి తన కుటుంబం గురించి అడుగుతూ ఉంటాడని సక్సస్ వచ్చిందని అహంకారంలోకి వెళ్ళద్దని సూచనలు ఇస్తూ జీవితంలో ఎలా ఎదగాలో తనకు ఒక అన్నయ్యలా సూచనలు పవన్ ఇచ్చే విషయాన్ని బయట పెట్టాడు. ఇప్పటి వరకు తాను ఎంతోమంది హీరోలతో సినిమాలు చేసినా ఏ హీరో కూడ తనతో పవన్ అంత ఆత్మీయంగా మాట్లాడిన సందర్భాలు లేవు అంటూ కామెంట్స్ చేసాడు.

దీనితో హరీష్ శంకర్ పవన్ ల కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది అన్న వార్తలకు క్లారిటీ వచ్చినట్లు అయింది. వాస్తవానికి హరీష్ శంకర్ కు పవన్ తో మరో సినిమా చేయాలని ఉన్నా పవన్ మాత్రం హరీష్ కు అవకాశం ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తున్నాడు. 

ప్రస్తుతం ‘వాల్మీకి’ విజయం హరీష్ కెరియర్ కు ఎంతో అత్యంత కీలకంగా మారింది. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి కూడ హరీష్ టాప్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరుకోలేకపోవడం హరీష్ కు దురదృష్టం అనుకోవాలి. ‘వాల్మీకి’ టైటిల్ పై వచ్చిన వివాదానికి సంబంధించిన కేసులు ఇంకా పెండింగ్ ఉండగానే ఈ మూవీని విడుదల చేస్తున్న పరిస్థితులలో ఈ సినిమాకు సంబంధించి ఆఖరి నిముషం టెన్షన్స్ ఏమైనా వస్తాయా అన్న అనుమానాలు కొందరిలో కలుగుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: