‘బిగ్ బాస్ 3’ షోను హోస్ట్ చేయడానికి నాగార్జునకు అత్యధిక పారితోషికం ఇచ్చి మరీ పెట్టుకున్నారు. అయితే నాగార్జున పెడుతున్న అనుకోని కండిషన్స్ ‘బిగ్ బాస్’ నిర్వాహకులకు ఊహించని షాక్ ఇస్తున్నాయి అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం హాట్ న్యూస్ గా మారింది. 

ఇప్పటి వరకు ‘బిగ్ బాస్’ షోను తెలుగులో హోస్ట్ చేసిన జూనియర్ అదేవిధంగా నానీలు ఏ ఒక్క వారం గ్యాప్ ఇవ్వకుండా తమ వ్యక్తిగత విషయాలను షూటింగ్ లను ఎడ్జెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అయితే నాగార్జున తన షష్టిపూర్తి సరదాల కోసం విదేశాలకు వెళ్ళడంతో నాగార్జున బ్రేక్ చేసిన వీకెండ్ ను రమ్య కృష్ణతో సరిపెట్టవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 

ఇప్పుడు నాగార్జునకు ఎప్పటి నుంచో అలవాటుగా కొనసాగుతున్న వీకెండ్ పార్టీల వ్యవహారంతో ‘బిగ్ బాస్’ షో నిర్వాహకులను తమ రూల్స్ మార్చుకోనవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ‘బిగ్ బాస్’ షోకు సంబంధించిన వీకెండ్ కార్యక్రమాలను శనివారం మధ్యాహ్నం షూటింగ్ మొదలుపెట్టి ఆరోజు అర్దరాత్రి వరకు షూట్ చేస్తారు. 

అయితే నాగ్ తన పద్దతి మార్చి ఈ వీకెండ్ కార్యక్రమాల షూటింగ్ ను శనివారం ఉదయమే మొదలుపెట్టి ఆరోజు సాయంత్రానికి ఫినిష్ చేస్తున్నాడట. దీనితో తనకు అలవాటైన వీకెండ్ పార్టీలు మిస్ కాకుండా ప్లాన్ చేసుకుంటున్నాడట నాగ్. ఇప్పుడు నాగార్జున కోసం ఇలా ఈ ఎలిమినేషన్ షోకు సంబంధించి ముందుగానే షూటింగ్ పూర్తి చేయడంతో శనివారం సాయంత్రానికే ‘బిగ్ బాస్’ షో నుండి ఎవరు ఎలిమినేట్ అయ్యారు అన్న విషయం లీక్ అవుతోంది. దీనితో ఈషో ఎలిమినేషన్ విషయంలో సస్పెన్స్ కొనసాగించలేక నాగార్జున మాటకు ఎదురు చెప్పలేక ‘బిగ్ బాస్’ నిర్వాహకులు తలపట్టుకుంటున్నారు అంటూ బుల్లితెర వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: