మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రంపై అభిమానుల్లో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీజర్ కి వచ్చిన స్పందనని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని మరింత జాగ్రత్తగా తీర్చిదిదుతున్నారు. మరో రెండు రోజుల్లో ట్రైలర్ ని విడుదల చేసే పనిలో ఉంది చిత్ర బృందం. అక్టోబర్ 2న రానున్న ఈ సినిమా కథ గురించి ఇప్పటికే పలు పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవ చరిత్ర మేరకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ సేనల చేతిలో అతి క్రూరంగా చంపబడతాడు.


ఆ అంశాన్ని సినిమాలో చూపించరనే అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే కథానాయకుడు చిరంజీవి కాబట్టి ఆయన పాత్ర మరణించడాన్ని అభిమానులు అంగీకరించలేరని అందుకే దాన్ని మార్చారనే పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ కారణం కొంతవరకు నిజమే అయినా చరిత్రను మార్చడం సబబు కాదు కాబట్టి చిత్ర బృందం సాహసించి నరసింహారెడ్డి వీర మరణాన్నే ముగింపుగా ఎంచుకున్నారట.


అయితే ఈ ముగింపులో వచ్చే డైలాగులు చాలా భావోద్వేగపూరితంగా ఉంటాయట. దేశభక్తిని పెంచే విధంగా ఈ డైలాగులని రాసుకున్నారట. చివర్లో వచ్చే ఈ డైలాగులు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయట. అంతేకాదు సినిమా చూశాక మనల్ని వెంటాడేవి ఆ డైలాగులేనట. సినిమాలో యాక్షన్ సన్నివేశాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో చివర్లో వచ్చే ఆ డైలాగులకి కూడా అంత ఇంపార్టెన్స్ ఉందని సమాచారం.


మొత్తానికి సినిమా ఒక ఏమోషనల్ ట్రీట్ అని తెలుస్తోంది. ఇకపోతే చిత్ర ట్రైలర్ ఈ నెల 18న విడుదలకానుంది. రామ్ చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, రవికిషన్ లాంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: