ఆయుష్మాన్ ఖురానా సినీ కెరియర్ సాఫి గా సాగిపోతుంది. ఆయన వరుసగా సినిమాలను ఒప్పకుంటున్నాడు. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించడమే కాకుండా ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు ను తీసుకుస్తున్నాయి .ఆయన హీరోగా నటించిన "అందాదున్" సినిమాకి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. ఆయన  చాలా వైవిధ్యభరితమైన కథంశాలతో కూడిన సినిమాలను ఎంచుకుంటున్నాడు. అ కథలకు ఆయన నటనతో మరింత అందాన్ని తీసుకవస్తున్నాడు.


ఆయుష్మాన్ ఖురానా  రిసెంట్ గా 35 వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు .  మా నాన్న గారు ఒక జోతిష్యుడు.నేను ఆయన చేప్పే జాతకాలను నమ్మను కానీ ఆయనను నమ్ముతాను. నా జీవితానికి ఆయనే ఒక కోచ్ మరియు ఒక మేంటర్. ఆయన నాకు ఎప్పుడు ఒక విషయం చెబుతారు ప్రజల యొక్క నాడి పట్టుకో అని నేను ఒక నటుడుగా ప్రేక్షకుల నాడి పట్టుకున్నాను.


నా డిగ్రి పూర్తయిన తరువాత నాన్న గారు ముంబాయి కి టికెట్ బుక్ చేసి నన్ను ఇంటి నుండి గెంటేశారు. నాతో ఒక మాట చెప్పారు వెళ్లి నటుడిగా మారు అని అన్నారు.చిన్న వయసు నుండే కెరియర్ గురించి ఆలోచించడం మొదలు పెట్టను.నాకు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు రోడిస్ అనే రియాలిటీ షో పాల్గొన్నాను. 27 సంవత్సరాలకు హీరోగా మారాను.ఈ 8 సంవత్సరాల జర్నీలో నేను పడ్డ కష్టాలు  మరియు నా అనుభవాలు నన్ను
ఈ స్థాయికి తీసుకవచ్చాయి అని అన్నాడు.
 ఆయుష్మాన్ ఖురానా నటించిన "డ్రీమ్ గార్ల్" సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. ప్రస్తుతం "బాల" అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: