ఎన్టీఆర్ పిలుపుతోనే కోడెల శివ‌ప్ర‌సాద్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. చాలా మంది తొలి తరం టీడీపీ నేత‌ల్లాగానే అన‌తికాలంలోనే ఉన్న‌త స్థాయికి  ఎదిగారు. మొద‌ట్లో చాలా డైన‌మిక్‌గా ఉండేవారు. కోడెల ఫ్యామ‌స్ డాక్ట‌ర్‌. తెలుగుదేశం పార్టీ చీలిపోయిన ప‌రిస్థితుల్లో ఆయ‌న చంద్ర‌బాబు ప‌క్షాన నిల‌బ‌డి బాబుకు బ‌ల‌మైన మ‌ద్ధ‌తుదారుగా నిలిచారు. అందుకు ప్ర‌తిఫ‌లంగా చంద్ర‌బాబు కూడా ఆయ‌న‌కు స‌ముచిత‌మైన ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి ఆయ‌న ఉన్న‌తికి తోడ్ప‌డ్డారు. ఆయ‌న‌కు  హోమ్ మినిస్ట‌ర్ వంటి కీల‌క భాధ్య‌త‌ల‌ను చంద్ర‌బాబు అప్ప‌గించారు. కోడెల త‌న డైన‌మిజంతో త‌న‌కంటూ ఓ కొత్త ఒర‌వ‌డిని సృష్టించుకున్నారు. దాంతో ఆయ‌న‌కు ప‌ల్నాటి పులి అన్న పేరు కూడా వ‌చ్చింది. రాజ‌కియాల్లో అంత డైన‌మిక్‌గా ఉన్న‌వాడిని చంద్ర‌బాబు పులిని కాస్త పిల్లిని చేశాడు. ఎందుకంటే పార్టీలో త‌న‌కంటే ఎక్క‌డ ఎక్కువ ఎదుగుతాడ‌నే భ‌యంతో 2014 ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత‌ ఆయ‌న‌కు ఎటువంటి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా స్పీక‌ర్ ప‌ద‌విని ఇచ్చారు. ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి ఇష్టం లేక‌పోయినా అయిష్టంగానే స‌మ‌ర్ధ‌వంతంగా ఆ ప‌ద‌విని నిర్వ‌హించారు. ఈ ఘ‌ట‌నతోనే కోడెల స‌గం ఢీలా ప‌డిపోయారు. 


దీనికి తోడు పార్టీలో ఆయ‌న ప్ర‌త్యేయ‌ర్ధుల్ని చంద్ర‌బాబు ప‌రోక్షంగా ప్రోత్స‌హించ‌డం కోడెల‌కు మింగుడుప‌డ‌లేదు.  కోడెల‌ను పార్టీ ప‌రంగా వాడుకున్న‌ప్ప‌టికీ పార్టీలోని సీనియ‌ర్ల‌ను క‌ట్ట‌డి చెయ్య‌డానికే బాబు ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆయ‌న మ‌ద‌న‌ప‌డేవారు. దీనికి తోడు ఆయ‌న కొడుకులు కూడా బాగా అరాచ‌కాల‌ను చెయ్య‌డం మొద‌లు పెట్టారు. మొత్తం ప‌ల్నాడు ఏరియాలో ఏ ప‌ని చెయ్యాల‌న్నా కె టాక్స్ (కోడెల టాక్స్‌) అని డ‌బ్బులు వ‌సూలు చేసేవారు. అంటే ఉదాహ‌ర‌ణ‌కు అక్క‌డ ఒక బిల్డింగ్ నిర్మించాల‌న్నా డ‌బ్బులు వ‌సూలు చేసేవారు. అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని లంచాలు తీసుకునేవారు. అక్క‌డ ప్ర‌జ‌లంద‌రి ద‌గ్గ‌ర లంచాలు తిని మొత్తానికి కోడెల‌కు చెడ్డ పేరు తెచ్చారు. దాంతో చంద్ర‌బాబు చేసిన ప‌నికి పులిలాంటి ఆయ‌న పిల్ల‌యిపోయారు. 


దీంతో తండ్రీ కొడుకుల మ‌ధ్య వ‌చ్చిన‌ విభేధాల వ‌ల్ల మ‌రి కాస్త కృంగిపోయారు.  తవ్వుతున్న కొద్దీ మాజీ స్పీకర్‌ కోడెల కుటుంబ సభ్యుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చివరకు అసెంబ్లీకి సంబంధించిన ఆస్తులను సైతం కోడెల కుటుంబీకులు వదల్లేదనే సమాచారం ఇప్పుడు బయటకు వచ్చాయి. హైదరాబాద్ నుండి అమరావతికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలించే సమయంలో చాలావరకు ఫర్నీచర్ సత్తెనపల్లి..నర్సరావుపేటకు తరలించారనేది అభియోగం. ఫర్నీచర్ తో పాటుగా ఏసీలు సైతం తరలి వెళ్లాయి. ఆ సమయంలో స్పీకర్ గా కోడెల ఉండటంతో ఈ విషయం పైన అంతర్గతంగా చర్చ మినహా..అసలు విషయం బయటకు రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో దీని పైన అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో..విచారణ మొదలైంది. ఏపీ అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్ నర్సరావుపేట..సత్తెనపల్లికి వెళ్లిన మాట వాస్తమేననే పోలీసులు చెబుతున్నారు.ఈ ప‌రిణామాల విష‌యంలో పార్టీ ప‌రంగా త‌న‌కు ఎటువంటి అండ‌దండ‌లు ల‌భించ‌క‌పోవ‌డంతో కోడెల మాన‌సికంగా కోలుకోలేని స్థాయికి వెళ్లిపోయారు. ఆయ‌న్ను ఆత్మ‌న్యూనత స్థితిలోకి నెట్టి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి దారి తీసింద‌ని ప‌రిశీలికులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: