టాలీవుడ్ లో లక్కీ హీరో.. మినిమం గ్యారెంటీ హీరోగా నేచురల్ స్టార్ నాని మంచి పేరు తెచ్చుకున్నాడు.  కెరీర్ బిగినింగ్ లో కొన్ని ఇబ్బందులు పడ్డా..పిల్ల జమిందార్ నుంచి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తర్వాత వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. అయితే మంచి హిట్స్ కొడుతున్న సమయంలో కృష్ణార్జున యుద్దం, దేవదాస్ కాస్త నిరాశపరిచాయి. 


ఈ సంవత్సరం జెర్సీ మూవీతో సూపర్ హిట్ అందుకున్నా..పైసా వసూల్ మాత్రం అంతంత మాత్రంగానే వచ్చింది.  ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా మంచి హిట్ టాక్ వచ్చినా.. వసూళ్ల పరంగా నీరసంగా సాగుగుంది. టాలీవుడ్ లో నాని ని అభిమానించే హీరోలు ఎంతో మంది ఉన్నారు.  దర్శక, నిర్మాతలు అయితే మనోడిని మినిమం గ్యారెంటీ హీరో అంటారు. నానికి యాంటీ ఫ్యాన్స్ దాదాపు ఉండరనే చెప్పాలి. ఫ్యామిలీస్ కి నాని అంటే మక్కువ ఎక్కువ. ఎక్కువగా డీసెంట్ హిట్లు కొట్టే నానితో సినిమా అంటే నిర్మాతలకు కూడా రిస్క్ తక్కువే. అయితే ఇవన్నీ పక్కనపెడితే నానికి మార్కెట్ స్తంభించినట్లుగా అనిపిస్తోంది.


అయితే నాని 50 కోట్ల మార్క్ కి ఇప్పటి వరకు రీచ్ కాలేదు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం మొదటి రోజు 4 కోట్ల 50 లక్షల గ్రాస్ వసూలు చేసింది. నాని మార్కెట్ చూసుకుంటే ఇది డీసెంట్ ఓపెనింగ్ అనొచ్చు. అయితే నాని గత నాలుగు సినిమాలు ఓపెనింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో మీరే చూడండి.


జెర్సీ- 4 కోట్ల 50 లక్షలు

దేవదాస్- 4 కోట్ల 61 లక్షలు

కృష్ణార్జున యుద్ధం- 4 కోట్ల 58 లక్షలు

నేను లోకల్ – 4 కోట్ల 45 లక్షలు

నిన్ను కోరి- 4 కోట్ల 59 లక్షలు


మరింత సమాచారం తెలుసుకోండి: