టాలీవుడ్ పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి అసెంబ్లీకి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్...తాను స్థాపించిన జనసేన పార్టీని అన్ని విధాల పైకి తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ మరో పక్క ప్రజల తరఫున పోరాటం చేస్తూ అధికారంలో ఉన్న వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. ఇటువంటి గ్రామంలో చాలా మంది అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమా చేయాలని చాలామంది సోషల్ మీడియాలో డిమాండ్ చేయడం వినిపిస్తుంది. కానీ పార్టీ తరఫునుండి మాత్రం పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాలు చేయడం కష్టమనే వార్తలు వినబడుతున్నాయి.


ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ తో సినిమా అనేదాన్ని విషయంపై డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా వెరైటీగా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హరీష్ ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు పదే పదే పవన్ తో సినిమా ఎప్పుడు అనే ప్రశ్నలు సంధించారు. అభిమానుల అత్యుత్సాహంపై హరీష్ శంకర్ స్పందన ఆసక్తికరంగా ఉంది. మీరు విజిల్స్ వేసి, కేకలు పెడితే కుదరదు. అది జరగాలని అభిమానులంతా బలంగా కోరుకోండి.. అయిపోద్ది అని హరీష్ శంకర్ కామెంట్స్ చేశాడు.


అంటే ఇప్పటికీ హరీష్ పవన్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడా అనే చర్చ జరుగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చే ఇండస్ట్రీలో అనేక రికార్డు సృష్టించి పవన్ కల్యాణ్ కెరియర్లోనే అతి పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. ఇటువంటి నేపద్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తలమునకలై ఉండగా హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: