సినిమా నటీనటుల జీవితం మరియు వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలని ప్రజలందరికీ ఉంటుంది. అయితే అందులో కొందరు నటులు తమ వ్యక్తిగత విషయాలను ప్రజలతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడితే, మరికొందరు మాత్రం పెద్దగా ఇష్టపడరు. ఇక సినిమా తారల డే లైఫ్ గురించి, మరియు వారి జీవన శైలి గురించి మనలో కొందరికి తెలిసే ఉంటుంది. అయితే దాదాపుగా ఎవ్వరికీ తెలియని హీరో, హీరోయిన్ల నైట్ టైం లైఫ్ గురించి, సాధారణ ప్రజలకు తెలిపేందుకు అతి త్వరలో తెలుగులో ఒక షో రాబోతోంది. ఆ షోను మంచువారమ్మాయి లక్ష్మి ప్రజంట్ చేయబోతున్నారు. 

వాస్తవానికి ఈ షో ఇప్పటికే బాలీవుడ్ లో 'ఫూట్ అప్ విత్ స్టార్స్' అనే పేరుతో ప్రసారం అవుతూ మంచి ప్రేక్షకాభిమానాన్ని చూరగొటోంది. ఇక ఇదే షోని కొద్దిరోజులుగా తెలుగు సెలెబ్రిటీలతో కూడా చేయాలని ప్రయత్నించిన వయాకామ్ 18 పిక్చర్స్ సంస్థ, ఎట్టకేలకు అతి త్వరలో షోని ప్రారంభించడానికి సిద్ధం అయింది. అందుకుగాను మంచి లక్ష్మితో వారు ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. గతంలో లక్ష్మి టాక్ షో, మేముసైతం వంటి షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి గారు అయితేనే ఇటువంటి షోని చక్కగా నడిపించగలరు అని భావించి ఆమెను ఎంపిక చేశారట. ఇక ఈ షోపై నేడు మంచు లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ, 

తనకు కూడా ఇటువంటి షోలపై ఎంతో ఆసక్తి ఉందని, ఇక సినిమా ఇండస్ట్రీలోని నటీనటులతో ఉన్న పరిచయాలు కూడా ఈ షోకు ఉపయోగపడుతాయని భావించి, హోస్ట్ గా చేయడానికి ఒప్పుకున్నానని ఆమె అన్నారు. నిజానికి స్టార్స్ డే లైఫ్ గురించి మనలో చాలా మందికి తెలుసు, బట్ వారి నైట్ లైఫ్ గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఈ షో ద్వారా వారి నైట్ లైఫ్ గురించి తెలియాని ఎన్నో విషయాలు ప్రజలకు తెలుస్తుంది. ఇటువంటి వినూత్న షో, నాకు మంచి అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు లక్ష్మి. కాగా ఈ షో ఈనెల 18 నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: