మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో మెగా అభిమానులకు చిన్నపాటి షాక్ ఇచ్చింది చిత్ర బృందం. ఈనెల 18వ తేదీన హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించాల్సిన రిలీజ్ ఈవెంట్ అనుకోని పరిస్థితుల్లో వాయిదా వేయవలసి వచ్చింది. దీంతో ఈ ఈవెంట్ కోసం భారీ ఎత్తున సన్నద్ధమైన ఫాన్స్ కొద్దిగా నిరాశపడ్డారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం హిందీతో పాటు దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల్లో రిలీజ్ కానుంది.

సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నాడే చిత్రానికి సంబంధించిన అన్ని పాటలను విడుదల చేయనున్నారు. ఆ రోజే థియేట్రికల్ ట్రైలర్ కూడా లాంచ్ చేస్తారు. ఎల్లుండిన జరగవలసిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను 22వ తారీఖు కి మేకర్లు వాయిదా వేశారు. 18వ తేదీన వాతావరణం అనుకూలించకపోగా పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో చిత్ర బృందం ఈవెంట్ ను వెంటనే వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇదిలా ఉండగా ఘోరమైన గోదావరి బోటు ప్రమాదం జరిగిన వెంటనే ఈవెంట్ ఎందుకు జరపడం అన్న కారణాంగా కూడా వాయిదా వేశారు అన్న వార్తలు కూడా బయటకు వచ్చాయి.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాత. ఈ చిత్రం తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార, అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్ ,విజయ్ సేతుపతి, తమన్నా వంటి హేమాహేమీలతో జరిగిన ఈ చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకులకు కన్నుల పండుగ కానుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: