టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ ‘సైరా నరసింహారెడ్డి’.   వివివినాయక్ దర్శకత్వలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీలో నటించాడు. ఈ మూవి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  అప్పటి వరకు మెగాస్టార్ పై రక రకాల అనుమానాలు వ్యక్తం చేసినా ఈ మూవీలో ఆయన ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు.  దాంతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. 

అయితే మెగాస్టార్ చిరకాల కోరిక ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ’ జీవిత కథపై బయోపిక్ లో నటించాలని కోరిక ఉండేదట..ఇక తండ్రి కోరిక గమనించిన తనయుడు రాంచరణ్ ‘సైరా నరసింహారెడ్డి’రూపకల్పన చేశాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 18న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని తొలుత భావించారు.

ఇటీవల ముంబాయిలో భారీ ఎత్తున టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే 18న భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలపడంతో అభిమానులు ఇబ్బంది పడతారని భావించిన చిత్ర యూనిట్ ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసి 22న కి మార్చినట్లు తెలుస్తుంది.  ఈవెంట్ జరిగేది ఓపెన్ గ్రౌండ్ లో కాబట్టి ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలగకుండా నాలుగు రోజులు వెనక్కి జరిపారు.  తాజాగా అందిన సమాచారం ప్రకారం అనుకున్న 18వ తారీఖున ఆడిటోరియంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.   ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ నటిస్తున్నారు. ఈ మూవీలో భారీ తారాగణం నటిస్తున్న విషయం తెలిసిందే.  నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతోంది. రామ్ చరణ్ నిర్మాత.



మరింత సమాచారం తెలుసుకోండి: