మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ దాదాపు 270 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా సైరా. చిరు 151 వ సినిమా ప్రేక్షకులముందుకు వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, నిహారిక వంటి భారీ తారగణం తో రూపొందించారు. అయితే ఈ సినిమా అతి త్వరలో ప్రపంచ స్థాయిలో భారీగా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో ఒక కొత్త సమస్య తలెత్తడడం ఇప్పుడు అందరిని డైలమాలో పడేసింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ పాలకులు దారుణంగా చంపారు. ఆ యోధుడి తల తీసి, కోట గుమ్మానికి వేలాడగట్టారు. అదిచూసిన తరువాత మరెవరైనా మళ్లీ బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు దిగే ఆలోచన చేయకూడదు అన్నది వాళ్ళ ఆలోచన. జీవిత కథ ఆధారంగా రూపొందించిన సినిమా కాబట్టి సినిమాలో కూడా అదే క్లయిమాక్స్ ను చిత్రీకరించక తప్పదు.

అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం సైరా సినిమాలో కూడా అదే విధమైన క్లయిమాక్స్ ను తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే దాంతోపాటు ఉయ్యాలవాడను దారుణంగా చిత్రహింసలు చేసినట్లు, కత్తులతో ఇష్టం వచ్చినట్లు దాడిచేసి కోతలు కోసినట్లు క్లయిమాక్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశం తాలూకా సీజీ వర్క్ కూడా పూర్తయిందని తాజా సమాచారం.

అయితే ఇంత వయిలెంట్ క్లయిమాక్స్ ను వుంచడమా? కాస్త తగ్గించడమే అనే పెద్ద డైలమాలో మెగాస్టార్ వున్నారని టాక్ వినిపిస్తోంది. దాదాపు వారం రోజుల కిందటే ఈ డైలమా స్టార్ట్ అయిందని, డిస్కషన్లు నడుస్తున్నాయని, ఎంతవరకు వుంచాలన్నది ఇంకా డిసైడ్ కాలేదని తెలుస్తోంది. నిజంగా ఇలాంటి క్లైమాక్స్ గనక ఉంచితే కథకు న్యాయం చేసినట్టు అవుతుంది. క్లైమాక్స్ మాంచి కిక్ ఉంటుంది. అలా కాకుండా ఈ క్లైమాక్స్ నచ్చక మెగా ఫ్యాన్స్ హర్ట్ అయితే మాత్రం పెద్ద ఎత్తున రచ్చ జరగడం మాత్రం ఖాయమని ఒక మాట కూడా వినిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: