ఉత్తరాది నుంచి దక్షిణాది చిత్ర పరిశ్రమకు వచ్చే హీరోయిన్లకు కొదవ లేదు. టాలీవుడ్ లో వీరికి పెద్దపీట వేస్తూంటారు. అలా టాలీవుడ్ కి వచ్చ లక్ ట్రై చేసుకున్న వాళ్లలో హంసా నందిని కూడా ఉంది. తెలుగులో మొదట్లో ఒకటీ ఆరా సినిమాల్లో హీరోయిన్ గా నటించినా నెగ్గలేక పోయింది. కానీ.. ఐటెం సాంగ్స్ కు మెయిన్ చాయిస్ గా ఆఫర్లు దక్కించుకుంటోంది. ఆమె బికినీలో ఉన్న ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హంసా నందిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తన లేటెస్ట్ ఫోటోస్ పోస్ట్ చేస్తూంటుంది. ప్రస్తుతం బ్లాక్ బికినీ వేసి హంసా ఇచ్చిన స్టిల్స్ కుర్రకారు మతిపోగొడుతున్నాయి. చక్కని మేనిఒంపుతో బ్లాక్ కలర్ బికినీ వేసి అచ్చం హంసలా ఉంది హంసా నందిని. అమ్మడు బికినీలో వయ్యారంగా ఇచ్చిన స్టిల్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. ‘ఎందుకో అంత కోపం..’ అంటూ తనకు తానే ఓ క్యాప్షన్ ఇచ్చుకున్న హంసా.. బికినీలో ఓరకంట చూస్తూ ఇచ్చిన స్టిల్స్ కు యూత్ ఫిదా అవుతున్నారు. ‘మోనాలిసా సైతం నీ అందాన్ని చూసి కుళ్లుకుంటుందేమో..’ ‘ప్రతి రోజూ నీలో ఓ కొత్త అందం పుట్టుకొస్తోంది..’ ‘కొద్దిగా నవ్వితే ఇంకా బాగుంటావ్ కదా..’ అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

రాజమౌళి సినిమా ఈగ సినిమాతో హంసా నందిని పాపులర్ అయింది. మిర్చిలో చేసిన స్పెషల్ సాంగ్ ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. పవన్ సరసన అత్తారింటికి దారేదిలో, రుద్రమదేవిలో అవకాశాలు పట్టేసింది. పూణేకు చెందిన హంసా అసలు పేరు పూనమ్. దర్శకుడు వంశీ తన అనుమానాస్పదం సినిమాలో ఈమె పేరును హంసా నందినిగా మార్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: