రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం యూత్ ట్రేండింగ్ హీరో అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్ మరియు సినిమా కెరీర్ గ్రాఫ్ ని ఎంతో ఎత్తుకు పెంచుకున్న ఈ యువ హీరో, ఆ తరువాత గీత గోవిందం సూపర్ సక్సెస్ తో మరింత పైస్థాయికి చేరారు. ప్రస్తుతం మంచి స్టార్ హీరో స్టేటస్ లో కొనసాగుతున్న విజయ్ ని ఇటీవల కొద్దికాలంగా ఫ్లాపులు వెంటాడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా, బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోవడం, 

అదీకాక అంతకముందు ఆయన నటించిన టాక్సీవాలా, నోటా సినిమాలు కూడా దెబ్బతినడంతో ఇకపై చేయబోయే సినిమాల విషయమై విజయ్ ఎంతో కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం విజయ్ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు  నిర్మాతగా, యువ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయ్ 9వ సినిమా టైటిల్ ని రేపు ఉదయం రివీల్ చేయనున్నారు. ఓనమాలు, మళ్ళి మళ్ళి ఇది రాని రోజు వంటి హృద్యమైన చిత్రాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్, ఈ సినిమాలో విజయ్ ని మంచి లవర్ బాయ్ క్యారెక్టర్ లో చూపించనున్నట్లు సమాచారం. 

మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'వరల్డ్ గ్రేటెస్ట్ లవర్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి. నిజానికి తొలుత ఈ సినిమాకు ఫైటర్ లేదా హీరో అనే టైటిల్స్ లో ఏదో ఒకటి టైటిల్ గా పెడదాం అని నిర్ణయించారట. అయితే వాటి రెండిటి కంటే వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ అనే టైటిల్ కొంత వెరైటీ గా ఉండడంతో పాటు యూత్ కు కూడా బాగా కనెక్ట్ అవుతుందని భావించి యూనిట్ ఈ టైటిల్ కే ఓటేసినట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లుగా విజయ్ లేటెస్ట్ మూవీ టైటిల్ ఇదా, కాదా అనేది తెలియాలంటే నేటి మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: