హలీవుడ్ సినిమాల ప్రభావం ప్రాంతీయ సినిమాల పైన ఎక్కువగా పడుతుంది. హలీవుడ్ సినిమాల్లో ఉండే భారీ గ్రాఫిక్స్ మరియు కళ్ళుచెదిరే యాక్షన్ సన్నివేశాలకు మన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీనికి ఉదాహరణ మొన్న వచ్చిన అవెంజర్స్ సినిమా ఒక కేవలం ఇండియాలోనే దాదాపు 350 కోట్ల వసూళ్లు సాధించింది. దర్శకులు మన ప్రేక్షకులకు అలాంటి అనుభవాన్ని ఇవ్వడానికి హలీవుడ్ సినిమాలకు పని చేసిన సాంకేతిక నిపుణులతో చేతులు కలుపుతున్నారు.


 ప్రభాస్  హీరోగా వచ్చిన సాహో సినిమా దాదాపు 350 కోట్ల తో నిర్మించారు. మిషన్ ఇంపాజిబుల్ మరియు ట్రాన్స్ ఫార్మర్స్  సినిమాకు స్టంట్ మ్యాన్ గా పని చేసిన కెన్ని బేట్స్  ఈ సినిమాకి పని చేశారు. సాహో ప్రీ క్లయిమాక్స్ లో వచ్చే కళ్ళు చెదిరే  యాక్షన్ సీక్వెన్స్ ని కెన్ని బేట్స్ కంపోజ్ చేశారు. ఈ సీక్వెన్స్  దాదాపు 70 కోట్లు ఖర్చు చేశారు.సాహో సినిమా రిజల్ట్ ను పక్కన పేడితే ఈ యాక్షన్ సినీ మాత్రం అందరికి నచ్చింది. .


ప్రస్తుతం మాస్ మహరాజా రవితేజ- పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న సినిమా "డిస్కో రాజా" ఈ సినిమాకి కె వి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో వచ్చే కీలక పైట్ ను షూట్ చేయడానికి యూరప్ వెళుతున్నారు.హాలీవుడ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7కి ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసిన స్టంట్ మాస్టర్ ఈ చిత్రానికి పని చేయనున్నారు.కేవలం నాలుగు నిమిషాల నిడివి ఉండే ఈ ఫైట్ కోసం దాదాపు గా 4-5 కోట్లు ఖర్చు చేస్తున్నారని టాక్.


తలైవి సినిమా లో కంగనా రనౌత్ దివంగాత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కనిపించనుంది.తలైవి సినిమా మేకప్ కోసం కెప్టెన్‌ మర్వెల్, హంగర్‌ గేమ్స్‌, బ్లేడ్‌ రన్నర్  సినిమాలకు పని చేసిన జసన్ కాలిన్స్  పని చేస్తున్నారని టాక్.ఈ సినిమా లో కంగనా నాలుగు గెటప్స్ లో కనబడనుంది. ఈ సంప్రదాయం వచ్చే రోజులలో మరింత పెరిగే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: