రాజమౌళి ఈగ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా వ్యక్తి కన్నడ సూపర్ స్టార్ సుదీప్.. ఆ సినిమాలో విలన్ గా నటించి మంచి పేరును కూడా సంపాదించాడు. దానితో తెలుగులో అడపాదడపా సినిమాలలో నటించే అవకాశాన్ని కొట్టేసాడు. అయన ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమా హైలెట్ అంశాలతో నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకునేది. అలా అయన కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సుదీప్ చిరంజీవి సైరా సినిమాలో నటిస్తున్నారు . ఆ సినిమాలో ఒక ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఎందరో సీనియర్ నటులు నటిస్తున్నారు. ఆ సందర్బంగా సుదీప్ మాట్లాడుతూ.. తెలుగులోని ఎంత పెద్ద స్టార్ తో స్క్రీన్ ను పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు.. కాగా, చిరంజీవి నుంచి మీరు నేర్చున్నది ఏదైనా ఉందా అని ఓ ఇంటర్వ్యూలో అడగగా ఆయన వెంటనే రాజకీయాల్లోకి వెళ్లకూడదని నేర్చుకున్న. మనకు ఎధొచ్చొ అదే చేయాలి అలాగని తెలియని వాటిలోకి వేళ్ళ కూడదని అయన ద్వారా అర్థమయింది. 

సినిమాలో హిట్స్ వస్తున్నాయని అటు వైపు వెళితే ఇంకా మనకు సినీ జీవితం ఎండ్ అవుతుందని నేర్చుకున్నానని ఆయన వెల్లడించారు. ప్రజల కోసం ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన అయన దాదాపు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉంది మళ్ళీ ఖైదీ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. నాకు చూస్తున్న రాజకీయాల పై అంత మోజు లేదని సుదీప్ అన్నారు. మిమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని ఎవరు అడగలేదా అనే ప్రశ్న ఎదురవ్వగా.. ఎందుకు లేదు చాలా మందే అడిగారు కానీ, నేను అంత పెద్ద రాజకీయ నాయకుడిని కాదు అంటూ అయన వేలలాడించారు. 

కొణిదెల ప్రొడక్షన్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు చెర్రీ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సీనియర్ నటులైన అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, అనుష్క, తమన్నా, నయనతార వంటి నటులు ఈ సినిమాలో ప్రముఖ పాత్రల్లో నటిస్తిన్నారు. ప్రమోషన్ లో ఉన్న ఈ చిత్రం ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అన్ని అనుకూలిస్తే వచ్చే నెల 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: