ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని యధాతదంగా తీయాలని జరిగిన ప్రయత్నాలలో ఈ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ కూడ వాస్తవికంగా తీసారు.  చరిత్ర కారులు చెపుతున్న ప్రకారం ఉయ్యాలవాడను ఆనాటి బ్రిటీష్ పాలకులు దారుణంగా చంపారు. 

ఆ యోధుడి తల తీసి కోట గుమ్మానికి వేల్లాడగట్టడమే కాకుండా మళ్ళీ అటువంటి తిరుగు బాటు ఆలోచనలు ఎవ్వరికీ రాకూడదు అన్న ఉద్దేశంతో ఉయ్యాలవాడను ఆనాటి బ్రిటీష్ దొరలు చంపే ముందు ఉయ్యాలవాడను తీవ్రంగా హించారు అని చరిత్రకారులు చెపుతారు. ఉయ్యాలవాడను చంపేముందు అతి క్రూరంగా హింసించి ఆతరువాత మాత్రమే అతడి తల నరకడం జరిగింది అని అంటారు. 

ఈ చరిత్రను వాస్తవంగా తీయమని చిరంజీవి చెప్పిన సూచనలతో సురేంద్ర రెడ్డి యధాతధంగా తీయడంతో పాటు దానికి తోడైన గ్రాఫిక్ వర్క్స్ సహాయంతో ఈ మూవీ క్లైమాక్స్ అత్యంత భయకరంగా వచ్చినట్లుతెలుస్తోంది. ముఖ్యంగా బ్రిటీషర్స్ ఉయ్యాలవాడను ఇష్టం వచ్చినట్లు కత్తులతో దాడి చేసి కోసిన సన్నివేశాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నా చూసే ప్రేక్షకులకు కూడ భయపడే విధంగా వచ్చినట్లు టాక్. 

దీనితో ఈ క్లైమాక్స్ సీన్స్ లోని హింసను కొంతవరకు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరీ వాస్తవిక దృష్టితో ఉండే క్లామాక్స్ ను చిరంజీవి అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు అంగీకరించపోవచ్చు అన్న ఉద్దేశ్యంతో చిరంజీవి అంగీకారంతో ఈ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. వాస్తానికి ఈ విషయమై రాజమౌళి సలహాలు తీసుకుందామని భావించినా సమయం లేకపోవడంతో తనకు తానుగా చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది అని వస్తున్న వార్తలతో పాటు ఈ మూవీ క్లైమాక్స్ సీన్స్ లోని దారుణ హింసకు సంబంధించిన వార్తలు విని మెగా అభిమానులు బెంబేలు పడిపోతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: