ఒకసారి ఇమేజ్ రావాలే కానీ అది పొమ్మంటే పోదు.. అందునా ఆ ఇమేజ్ తో ఫుల్ గా కుర్ర గుండెలతో ఆడేసుకుంటున్న ముద్దు గుమ్మకు మరిన్ని ఆఫర్లు అలాగే తన్నుకువస్తున్నాయి. ఆమె ఎవరో కాదు, పాయల్ రాజ్ పుత్. ఆమె ఆరెక్స్ 100 తో ఎంట్రీ ఇచ్చి వేడి సెగలు పుట్టించింది. ఐటం బాంబ్ కంటే దారుణంగా హాట్ హాట్ అనిపించింది.


ఆ తరువాత ఆమె వరసగా  స్పెషల్ సాంగ్స్ కి రెడీ అంటోంది. టాలీవుడ్ సైతం ఆమెను తెగ వాడేసుకోవాలనుకుంటోంది. ఈ మధ్యన డైరెక్టర్ తేజా తీసిన సీత మూవీలో బుల్ రెడ్డి సాంగ్ తో పాయల్ ఎంతగా చిర్రెత్తించిందో అందరికీ తెలిసిందే. ఇక ఆ మూవీ తరువాత పాయల్ వెంకీతో జోడీ కట్టింది. సాఫ్ట్ క్యారక్టర్లు మన ఒంటికి పడవు అన్నట్లుగా పాయల్ మళ్ళీ రెచ్చిపోవడానికే రెడీ అవుతోందట.


తేజ మరోసారి లేడీ ఓరియెంటెండ్ మూవీని తీస్తున్నారు. ఈ మూవీలో కూడా పాయల్ అందాలతో మ్యాజిక్ చేయలనుకుంటున్నాడని టాక్. ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ లో పాయల్ అందాల ఆరబోత ఉంటుందట. బుల్ రెడ్డి సాంగ్ ని డామినేట్ చేసేలా పాయల్ ఈ మూవీలో తన సోయగాలతో యూత్ ని చిత్తు చేస్తుందని అంటున్నారు.


ఇదిలా ఉండగా పాయల్ రాజ్ పుత్ హాట్ ఇమేజ్  నే కంటియూ చేయాలనుకోవడంతో ఆఫర్లు స్పెషల్ సాంగ్స్ మాత్రమే వస్తున్నాయి. అయితే తనలో అధ్బుతమైన నటి కూడా ఉండని, దాన్ని కూడా వాడుకోవాలను ఈ హాటీ అంటోందట. మరి పాయల్ హాటీని, స్వీటీని మిక్స్ చేసే స్టోరీతో ఎవరైనా  డైరెక్టర్ కధ చెబితే బాగుంటుందేమో. ఈ ముద్దుగుమ్మ అందాలతో పాటు, నటనను కూడా ఫుల్ గా చూసేయొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: