తెలులో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటికీ 50 రోజులు దాటిపోయింది.  ఇప్పటి వరకు బిగ్ బాస్ రక రకాల టాస్క్ లు, గేమ్ లు ఇంటి సభ్యులకు ఇచ్చారు..కాని నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం కాస్త టఫ్ టాస్క్ ఇచ్చాడు.  ఎలిమినేట్ అయిన సభ్యులను మరొకరు త్యాగం చేసి ఈవారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే వసతి కల్పించాడు.  ఈ నేపథ్యంలో పునర్నవి కోసం రాహూల్ చేసిన త్యాగం నిజంగా షాక్ కి గురి చేసింది. పునర్నవిని డైరెక్ట్ నామినేషన్ చేయగా, ఆమె సేవ్ అవ్వాలంటే రాహుల్ ఓ సాహసం చేయాలని బిగ్ బాస్ సూచించాడు.

రాహుల్ 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగితే పునర్నవి ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటుందని చెప్పాడు. మొదట ఈ టాస్క్ రిస్క్ అనుకున్నా.. మొదటి నుంచి వీరి మద్య ఉన్న స్నేహ సంబంధం కోసం రాహూల్ ముందుకు వచ్చాడు.  మొత్తానికి 20 గ్లాసుల కాకరికాయ జూస్ తాగాడు.  ఆ తర్వాత బాబా భాస్కర్ కోసం రవికృష్ణ షూ త్యాగం చేశాడు. వరుణ్ కోసం శ్రీముకి బిగ్ బాస్ టాటూ వేయించుకుంది. మహేష్ కోసం హిమజ బట్టలు, మేకప్ కిట్ త్యాగం చేయాల్సి ఉన్నా ఆమె చేసిన పొరపాటు వల్ల మహేష్ ఎలిమినేషన్ రౌండ్ లోకి వెళ్లిపోయాడు. 

ఇక హిమజ కోసం వరుణ్ సందేశ్ బీభత్సమైన టాస్క్ ఎదుర్కొవాల్సి వచ్చింది.  పేడ తో ఉన్న నీటి టబ్ లో బిగ్ బాస్ చెప్పేవరకు పడుకోవాలని సూచించారు. ఈ టాస్క్ చేసే సమయంలో వరుణ్ కాస్తా ఇబ్బంది పడ్డాడు..దాంతో హిమజ తన గురించి ఇంత రిస్క్ తీసుకోవొద్దు అని బ్రతిమిలాడింది. కానీ తాను ఎలాగైనా ఈ టాస్క్ చేస్తానని వరుణ్ భలే త్యాగం చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: