సినిమా హీరోలకి ఉన్న అభిమానులు వాళ్ళకి తెలియకుండానే ఒక్కోసారి హీరోలని ఇబ్బంది పెడుతుంటారు. అయితే హీరోలకి ఉన్న బలం అభిమానులే. వాళ్ళే లేకపోతే సూపర్ స్టార్స్ అన్న ఇమేజ్ హీరోలకి రాదు. హీరో ఏం చేసినా ఆయన వెనక ఉండడానికి సిద్ధంగా ఉంటారు. అయితే కొన్ని సార్లు అభిమానులు చేసే పనులు హీరోలని ఇబ్బందుల్లో పడేస్తాయి. కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు అభిమానులకి పండగ వచ్చినంత ఆనందం వేస్తుంది 


ఆ ఆనందంలో ముందు వెనకా చూసుకోకుండా థియేటర్లని ఫంక్షన్ హాల్ లాగా ముస్తాబు చేస్తారు. థియేటర్ మొత్తం బ్యానర్లతో నింపేస్తారు. కటౌట్లు కడతారు. పాలాభిషేకాలు చేస్తారు. అయితే ఇదంతా సజావుగా జరిగితే బాగానే ఉంటుంది. కానీ ఇలాంటివి చేసినపుడు అభిమానులకి ఏదైనా జరిగితేనే అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. తాజాగా తమిళనాడులో జరిగిన సంఘటన దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.


ఇటీవల జరిగిన ఈ సంఘటన అందరి హీరోల్లో మార్పును తీసుకొచ్చింది. థియేటర్లో కట్టిన బ్యానర్ కారణంగా శుభశ్రీ అనే యువతి మరణించడంతో హీరోలందరూ బ్యానర్ సంస్కృతిని వ్యతిరేకంగా తమ గళం విప్పుతున్నారు.హీరో సూర్య తన తాజా చిత్రం బందోబస్త్ బ్యానర్స్ కట్టరాదని పిలుపునిచ్చారు. అలాగే మరో ఇద్దరు స్టార్ హీరోలైన విజయ్, అజిత్ కూడా దీనికి మద్దతుగా తమ గళం కలిపారు.


తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ కూడా కలవడం జరిగింది. ఆయన తమిళనాడులో బ్యానర్స్ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే బ్యానర్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన శుభశ్రీ ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. పర్యావరణానికి హాని కలిగించడంతో పాటు, అనేక ప్రమాదాలకు కారణమవుతున్న బ్యానర్స్ కి వ్యతిరేకంగా తమిళ హీరోలు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఇది టాలీవుడ్ హీరోలు కూడా అమలుచేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: