ఆర్ ఎక్స్ 100 చిత్రంతో ఒక్కసారిగా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్, ఆ సినిమాలో తన గ్లామర్ తో  కుర్రకారు మతి పోగొట్టింది. అయితే  ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఆమెకు విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ఆమె పాత్రకి తగ్గట్టు నటించినప్పటికీ, నటన కంటే ఎక్కువ ఆమె గ్లామర్ కే పేరొచ్చింది. దాంతో  ఆమెకు అవకాశాలు అనుకున్నంతగా  రాలేదు.


పాయల్ ప్రస్తుతం  ఆర్డీఎక్స్ లవ్ పేరుతో తెరకెక్కుతున్న కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రంలో నటిస్తున్నారు. నూతన హీరో తేజుస్ కంచెర్ల హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో పాయల్ నే ప్రధాన పాత్ర చేయడం జరిగింది. ఈ సినిమాలో పాయల్ గ్లామర్ డొస్ మరింత పెంచినట్లుగా తెలుస్తుంది. చిత్ర బృందం పాయల్ గ్లామర్ నే నమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ని చూస్తుంటే ఆర్ ఎక్స్ కంటే ఎక్కువ గ్లామర్ షో ఉంటుందని అనిపిస్తుంది.


అయితే ఈ సినిమాలో కంటెంట్ బోల్డ్ గా ఉంటుందట. అందుకే టీజర్ ని ఆ విధంగా చూపించారని అంటున్నారు. ఇకపోతే బోల్డ్ కంటెంట్ తో పాటు కథా బలం కూడా ఉన్న ఈ సినిమాలో పాయల్ యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 11 వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది చిత్ర బృందం. ఈ మేరకు ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది.


ఇక దసరాకి పోటీ పడే చిత్రాలని గమనిస్తే, మొదటగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా విడుదల అవుతుంది. అంతే గాక వెంకీమామ, వార్ లాంటి చిత్రాలు దసరాకి విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. మరి అన్ని పెద్ద చిత్రాల మధ్యలో ఈ సినిమా నిలబడుతుందా లేదా అనేది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: