బిగ్ బాస్ లో సోమవారం నామినేషన్ ప్రక్రియలో మహేష్ ఒక్కడే నామినేట్ అయ్యాడు. అతను నామినేట్ అయిన విధానం కూడా అనేక చర్చలకి దారి తీసింది. ఒక దశలో మహేష్ ఒక్కడే నామినేషన్ లో ఉంటాడేమో అనిపించింది. అయితే ఇంకా నామినేషన్ ప్రక్రియ పూర్తికానందున ఎవరెవరు నామినేషన్ లో ఉంటారనేది ఆసక్తిగా మారింది. నిన్న మిగిలిన వారిలో రవి రాహుల్ లు ఉన్నారు. వీరిద్దరిలో రవి నామినేషన్ నుండి సేవ్ అవుతాడని అనిపిస్తుంది.


ఎందుకంటే నిన్న రిలీజ్ చేసిన ప్రోమోలో శివజ్యోతి తన జుట్టు కత్తిరించుకున్నట్లుగా చూపించరు. అది రవికోసమే అయ్యుంటుందని అనిపిస్తుంది. సోమవారం జరిగిన ఎపిసోడ్ లో శివజ్యోతి రవి తో మాట్లాడుతూ, నేను ఎవరికోసం త్యాగాలు చేయను. నీకోసం అయితే చేస్తాను తప్పితే వేరే వాళ్లకోసం చేయను అంటుంది. దీన్ని బట్టి ఆమె రవికోసమే చేసినట్టు అర్థం చేసుకోవచ్చు.


ఇక మిగిలింది రాహుల్, ఈ టాస్క్ గత సీజన్ టాస్క్ ని పోలి ఉంది కాబట్టి రాహుల్ సేవ్ అవ్వాలంటే సీజన్ మొత్తం నామినేట్ అవ్వాలనే అంశం ఉంటుండొచ్చని సమాచారం. అయితే ఈ త్యాగం రాహుల్ స్నేహితురాలైన పునర్నవి చేయాల్సి ఉంటుంది కావచ్చు. ఒక వేళ అదే జరిగితే పునర్నవి దానికి ఒప్పుకోదు. రాహుల్ కూడా ఆమె ఒప్పుకోవాలని అనుకోడు. తనకోసం త్యాగం చేయకపోయినా ఫర్వాలేదని అనుకునే మనస్తత్వం గలవాడు, అందునా సీజన్ మొత్తం నామినేట్ అంటే చిన్న విషయం కాదు కాబట్టి త్యాగం చేయాల్సిన అవసరం లేదని అనుకుంటాడు.


దీంతో రాహుల్ కూడా నామినేషన్స్ లోకి వస్తాడు. ఇక నామినేషన్స్ లో ఇద్దరే ఉన్న కారణంగా కెప్టెన్ వితికాని తనకి ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఎవరో ఒకరిని నేరుగా నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్తాడని అనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే వితికాకి హిమజ అంటే అస్సలు ఇష్టం లేదు. అదీగాక ఆమె కోసం వరుణ్ పేడ తొట్టిలో పడుకున్నప్పుడు ఆమె ఏడుస్తూనే ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఆమె హిమజని నామినేట్ చేయవచ్చు. మొత్తానికి ఈ వారం నామినేషన్ లో మహేష్ తో పాటు, రాహుల్, హిమజ లు కూడా ఉంటారని విశ్లేషిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: