విజయ్ దేవరకొండ, దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి చాలా గమ్మత్తైన టైటిల్ ని అనౌన్స్ చేశారు. "వరల్డ్ ఫేమస్ లవర్" అనే టైటిల్ తో విజయ్ మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతున్నందట. విజయ్ నలుగురు అమ్మాయిలని ప్రేమిస్తాడట. అందుకే ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు ఉన్నట్టుగా సమాచారం.


అర్జున్ రెడ్డి సినిమాలో ఒక్క అమ్మాయినే ప్రేమించి తన ప్రేమని నిలబెట్టుకున్న విజయ్, ఈ సారి తన ప్రేమని విశ్వవ్యాప్తం చేయాలని అనుకుంటున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన రాశీ ఖన్నా నటిస్తుంది. ఆమెతో పాటు ఐశ్వర్య రాజేష్ కేథరిన్ థెరీసా, ఇసబెల్ల నటిస్తున్నారు. ఇంతమంది హీరోయిన్లు ఉన్నారంటే సినిమా కథ ఏ విధంగా ఉండబోతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె యస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. క్రాంతి మాధవ్ సినిమాలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఆయన తీసిన క్లాసిన్ మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు ని ఎప్పటికీ మర్చిపోలేం. అలాగే విజయ్ దేవరకొండ నుండి అర్జున్ రెడ్డి లాంటి సినిమాలని ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు.


మరి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందనేది సస్పెన్స్ గా మారింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని సెప్టెంబర్ 20 వ తేదీన విడుదల చేస్తారట. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం అర్జున్ రెడ్డి లాంటి ప్రభావాన్ని చూపిస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: