నాని హీరోగా వచ్చిన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్ ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయి, తొలిరోజు తొలిఆట నుండే సూపర్ హిట్ టాక్ మరియు అద్భుతమైన కలెక్షన్స్ తో రన్ అవుతోంది. వాస్తవానికి నిన్నటినుండి గ్యాంగ్ లీడర్ కు అక్కడక్కడ కలెక్షన్స్ కొంత తగ్గినప్పటికీ, ఇవాళ్టి నుండి మరికొంత పెరిగే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే మొదటి సోమవారం ఎంత హిట్ సినిమాకైనా కలెక్షన్స్ అలానే ఉంటాయనేది వారు చెప్తున్న మాట. ఇక మరొక మూడు రోజుల్లో వాల్మీకి రిలీజ్ కానుండడంతో, 

ఆ సినిమా ప్రభావం ఎంతవరకు గ్యాంగ్ లీడర్ పై పడుతుంది అనేది మాత్రం దానికి వచ్చే టాక్ ని బట్టి చెప్పగలం అంటున్నారు. ఇక గ్యాంగ్ లీడర్ కు మొత్తం గా రూ.30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని, ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు చూసుకుంటే, ఓవర్ ఆల్ గా రూ. 15.7 కోట్లవరకు ఉన్నాయని, దీనినిబట్టి గ్యాంగ్ లీడర్ అప్పుడే సగానికి పైగా పెట్టుబడిని రాబట్టినట్లే అని వారు అంటున్నారు. ఇక రాబోయే మరొక పది రోజులు కనుక గ్యాంగ్ లీడర్ ఈ విధంగానే తన హవాను కొనసాగించగలిగితే, మొత్తం పెట్టుబడిని రాబట్టి, అక్కడినుండి లాభాల బాట పడుతుందట. ఆకట్టుకునే కథ, 

కథనాలతో మంచి స్క్రీన్ ప్లే తో దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ రివెంజ్ డ్రామాలో, నాని మరొక్కసారి నాచురల్ స్టార్ గా అద్భుత నటన కనబరచగా, సీనియర్ లక్ష్మి, ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయలు సినిమాకు మరింత ప్లస్ పాయింట్ గా మారారు. ఇక హీరోయిన్ గా తొలిసారి తెలుగులో నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ముఖ్యంగా అనిరుద్ అందించిన పాటలు, కూబా ఫోటోగ్రఫీ ఈ సినిమాకు మెయిన్ ఆసెట్స్ గా చెప్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న గ్యాంగ్ లీడర్, ఫైనల్ గా ఎంతమేర కొల్లగొడతాడో తెలియాలంటే మాత్రం మరికోదిరోజులు ఓపికపట్టాల్సిందే......!!


మరింత సమాచారం తెలుసుకోండి: