టాలీవుడ్ లో ఈమద్య బాలీవుడ్ అందాల తారలు వరుసగా వస్తున్న విషయం తెలిసిందే.  అయితే కొంత మంది మాత్రం మెరుపుతాగల్లా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు.  ఒకరూ ఇద్దరు హీరోయిన్లు మాత్రం కెరీర్ కొంత కాలం కొనసాగిస్తున్నారు.  తాజాగా ‘భరత్ అనే నేను' సినిమాలో మహేస్ బాబు సరసన నటించి కియారా అద్వాని తర్వాత బోయపాటి-రాంచరణ్ కాంబినేషన్ లోవచ్చిన ‘వినయ విధేయరామ’ నటించింది. అయితే ఈ మూవీ కియారా కు మాత్రం పెద్దగా కలిసి రాలేదు..కానీ తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. 

ఇక బాలీవుడ్ లో సందీప్ వంగా దర్శకత్వంలో షాహిద్ కపూర్, కియారా అద్వాని జంటగా నటించిన ‘కబీర్ సింగ్’సూపర్ హిట్ అయ్యింది.  ఈ అమ్మడు సినిమాల్లో కన్నా తన ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూ వస్తుంది.  తన ఘాటైన అందాల ఆరబోతతో అభిమాను మనసు దోచేస్తుంది. 'కబీర్ సింగ్'  మంచి హిట్ కావడంతో ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుసగా ఛాన్సులు వస్తున్నాయి.  సందర్భం ఏదైనా దానికి తగ్గ దుస్తులు ధరించి చూపరులను మాయలో పడేసి తనవైపు ఆకర్షించడంలో కియరాకు వెన్నెతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు.

తాజాగా  ఈ ఫోటోలో కియారా ఒక లైట్ కలర్ స్లీవ్ లెస్ ఇన్నర్ లాంటి టీ షర్టు ధరించింది... దానికి మ్యాచింగ్ గా క్రీం కలర్ త్రీ ఫోర్త్ ప్యాంట్ ధరించింది. ఈ ఫోటో లో వైట్ స్పోర్ట్స్ షూ ధరించి.. ఒక చేతిలో స్మార్ట్ ఫోన్.. మరో చేతిలో పెద్ద బ్యాగ్ పట్టుకుని  చిరునవ్వులు చిందిస్తూ రోడ్ పై నడుస్తోంది. ఈ అమ్మడి టైట్ అందాలు చూస్తుంటే నిజంగా మోడ్రన్ దేవకన్య రోడ్డుపై నడుచుకుంటూ వస్తుందా అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: