తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 లో ఇంటి సభ్యులు మరింత జోష్ పెంచారు.  ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా సాఫీగా సాగిపోతున్న బిగ్ బాస్ లో ఒక్కసారే హాట్ సీన్ తో ఆసక్తి రేకెత్తించారు.  గతంలో బిగ్ బాస్ 1, 2 సీజన్ లో రాని రసవత్తర సన్నివేశాలు ఇప్పుడు బిగ్ బాస్ 3 లో కనిపిస్తున్నాయి.  భార్యాభర్తలు అయిన వరుణ్ సందేష్, వితిక మద్య రొమాంటిక్ సన్నివేశాలు.. రాహూల్-పునర్నవిల మద్య ప్రేమాయణం తో బిగ్ బాస్ 3 రోజు రోజుకీ ఆసక్తి రేపుతుంది.  గతంలో ఇంటి సభ్యులు మద్య స్నేహ సంబంధాలు..కాస్త రొమాంటిక్ సన్నివేశాలు వచ్చినా..ముద్దు సీన్లు మాత్రం కనిపించలేదు. 

తాజాగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నవారు వేరొక ఇంటి సభ్యుడు సేవ్ చేస్తే వారు ఈ వారం ఎలిమినేట్ కాకుండా ఉంటారు. ఈ క్రమంలో పునర్నవి టెలిఫోన్ బూత్ లోకి పిలిచిన బిగ్ బాస్ రాహూల్ 20 గ్లాసులు కాకరకాయ రసం తాగాలని టాస్క్ ఇచ్చారు.  మొదట ఈ టాస్క్ చూసి అందరూ భయపడిపోయారు..అంత చేదు కాకరకాయ రసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై గ్లాసులు తాగడం కాస్త రిస్క్ అనుకున్నారు.  కానీ పునర్నవి-రాహూల్ కి మద్య ఉన్న స్నేహ సంబంధంతో ఈ టాస్క్ చాలా సింపుట్ గా తీసుకున్నాడు.

మొత్తానికి ఇరవై గ్లాసులు తాగి ఈ వారం పునర్నవిని ఎలిమినేట్ కాకుండా చూశాడు రాహూల్.  టాస్క్ పూర్తి చేసుకొని పునర్నవి వద్దకు వెళ్లగానే ఒక్కసారే హగ్ చేసుకొని ముద్దు ఇచ్చింది..దాంతో ఇంటి సభ్యులు అంతా ఒక్కసారే షాక్ తిన్నారు. గత వారం నాగార్జున ముందు ఇద్దరు చాలా గొడవపడ్డారు..దాంతో వీరి మద్య స్నేహసంబంధం కట్ అనుకున్నారు..కానీ నిన్నటి టాస్క్ లో ఏకంగా ముద్దు సీన్ కనిపించడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. తాజాగా వీరి హగ్స్, కిస్ లు ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: