నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా తిరుగులేని ప్రస్థానాన్ని సాగించిన ఆయన ప్రధాన మంత్రి అవుతారని ఎవ్వరు ఊహించలేదు.సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రస్తుతం నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.ఇక రెండోసారి ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టాక ఆయన మరింత స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటు ముందుకెళ్లుతున్నారు ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ,ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూ ప్రపంచదేశాల చూపులను తనవైపు తిప్పుకున్నారు.అంతేకాకుండా విదేశాల నుంచీ భారత్‌కు మద్దతు పెరిగేందుకు అంతర్జాతీయ స్థాయిలో సత్సంబంధాల్ని పెంచుతున్నారు.అటు పార్టీనీ,ఇటు దేశాన్నీ బలోపేతంగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్న ఆయన నేడు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.



ఈ సందర్భంగా ఆయనకు కోట్లాది ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇక నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన బయోపిక్‌కు సంబంధించిన ప్రకటనను రిలీజ్ చేసారు ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్‌ లీలా బన్సాలీ.అయితే తొలి ప్రకటనతోనే సినిమాపై అంచనాలు పెంచేందుకు తొలి పోస్టర్‌ను ఓ ప్యాన్‌ ఇండియా స్టార్‌తో రిలీజ్ చేయించాలనుకున్న బన్సాలీ,ఆ బాధ్యతను బాహుబలి ప్రభాస్‌కు అప్పగించారు.అయితే ఇప్పటికే నరేంద్ర మోదీపై ఓ బయోపిక్ తెరకెక్కింది.వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన‘నరేంద్ర మోదీ’అనే చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.అయితే ఇప్పుడు తీయబోయే మోదీ బయోపిను మాత్రం అలా ఇలా కాదని ఈయన చరిత్రను ప్రతీ ఒక్కరికీ తెలిసే విధంగా తీసేలా సన్నాహాలు జరుగుతున్నాయట.



‘మన్‌ బైరాగీ’అనే టైటిల్‌తో త్వరలో వెండితెరపై సందడి చేయనున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను 17వ తేదీన ప్రధాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు.ఇక బాహుబలి,సాహో సినిమాలతో జాతీయ స్థాయిలో తన మార్కెట్ స్టామినాను ప్రూవ్‌ చేసుకున్న ప్రభాస్‌,తన సోషల్‌ మీడియా ద్వారా మోదీ బయోపిక్‌‘మన్‌ బైరాగి’ఫస్ట్‌ లుక్‌ తెలుగు పోస్టర్‌ను రిలీజ్ చేయగా హిందీ పోస్టర్‌ను అక్షయ్‌ కుమార్ విడుదల చేశారు.సంజయ్‌ త్రిపాఠి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహావీర్‌ జైన్‌తో కలిసి సంజయ్ నిర్మిస్తున్నారట.మరో విషయమేంటంటే ప్రధాని మోదీ జీవితానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: