సాధార‌ణంగా ఏడాదికి సుమారు 200 సినిమాలకు పైగా విడుద‌ల అవుతుంటాయి. వీటిలో కొన్ని సూప‌ర్ డూప‌ర్ హిట్ అయితే మ‌రికొన్ని చ‌తికిల‌ప‌డ‌తాయి. భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన సినిమాలు కూడా ఒక్కోసారి ఊహించ‌ని విధంగా ఫ్లాపుల దిశ‌గా దూసుపోతుంటాయి. వాస్త‌వానికి ఫ‌స్ట్ డే సినిమాపై క్లారీటి ఇస్తే.. ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తాయి. అయితే టాలీవుడ్‌లో ఫ‌స్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ బ‌ద్ద‌లు కొట్టిన టాప్ హిట్స్‌పై ఓ లుక్కేయండి..


సాహో - యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌- సుజిత్ కాంబినేష‌న్‌లో దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి వారం రూ.350 కోట్ల గ్రాస్, రూ.188.5 కోట్ల షేర్ వసూలు సాధించింది.


మహర్షి - మహేష్ మ‌హ‌ర్షి చిత్రం మొదటి వారం రూ.122.91 కోట్ల గ్రాస్ సాధించ‌గా.. డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.76 కోట్లు రాబట్టింది.


నాన్నకు ప్రేమతో - యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ ఈ సినిమా తొలివారంలో రూ.43 కోట్లు వసూలు చేసింది.


అత్తారింటికి దారేది - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తొలివారంలో ఈ సినిమా రూ.47 కోట్లు వసూలు చేసింది.


బ్రూస్ లీ - రామ్ చరణ్, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా నటించిన ఈ సినిమా మొదటివారంలో రూ.53 కోట్లు   ద‌క్కించుకుంది.


సరైనోడు -  బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తెలుగు యాక్ష‌న్ డ్రామా స‌రైనోడు తొలివారంలో రూ.127 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది.


సర్దార్ గబ్బర్ సింగ్ - కె. ఎస్. రవీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలివారంలో రూ.73 కోట్లు వసూలు చేసింది.


అజ్ఞాతవాసి - పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్ మ‌రియు అను ఇమ్మాన్యుయేల్ క‌లిసి న‌టించిన ఈ సినిమా మొదటివారంలో రూ.88 కోట్ల గ్రాస్ వసూలు ద‌క్కించుకుంది.


కాటమరాయుడు - పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా తమిళ 'వీరం' సినిమాకి రీమేక్. 2017 లో రిలీజైన ఈ సినిమా తొలివారంలో రూ.86 కోట్లు వసూలు చేసింది.


శ్రీమంతుడు - కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్‌ బాబు - శృతి హాసన్ జంట‌గా న‌టించిన ఈ సినిమా తొలివారంలో రూ.101 కోట్లు వసూలు సాధించింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం రూ 144.4 కోట్లు రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది.


దువ్వాడ జగన్నాథం - అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన ఈ చిత్రం తొలివారానికి రూ.64 కోట్ల గ్రాస్ వసూలు చేసి రూ.43.6 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది.


జై లవకుశ - కె.ఎస్.రవీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభనయం చేసిన ఈ సినిమా మొదటి వారానికి రూ.90 కోట్ల గ్రాస్, రూ.54 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది.


జనతా గ్యారేజ్ - కొరటాల శివ, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్లో వ‌చ్చిన ఈ సినిమా మొదటి వారంలో రూ.100 కోట్లు కలెక్ష‌న్ రాబ‌ట్టి ఎన్టీఆర్‌కు మంచి కిక్ ఇచ్చింది.


ఖైదీ నెం 150 - చిరంజీవి కమ్ బ్యాక్ ఫిల్మ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సత్తా చాటింది. మొదటి వారంలో రూ.95 కోట్ల గ్రాస్, డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.66 కోట్లు వసూలు చేసింది.


భరత్ అనే నేను - కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ బాబు, కైరా అద్వానీ జంట‌గా న‌టించిన ఈ సినిమా మొదటి వారంలో రూ.117 కోట్లు గ్రాస్, రూ.72 కోట్ల షేర్ ద‌క్కించుకుంది.


రంగస్థలం - సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఈ సినిమా తొలివారంలో రూ.127 కోట్ల గ్రాస్ వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు రూ.80 కోట్ల షేర్ మిగిల్చింది.


అరవింద సమేత - ఎన్టీఆర్ నటించిన, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన‌ ఈ సినిమా మొదటి వారానికి రూ.134 కోట్లు వసూలు చేసి.. రూ.82 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది.


బాహుబలి (ది బిగినింగ్) -  ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా రూ.75 కోట్ల ఓపెనింగ్స్ తో మొదలుపెట్టి మొదటి వారానికి రూ.255 కోట్ల వసూలు చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ.602 కోట్లు వసూలు చేసింది. 2015లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులు కొల్లగొట్టింది.


బాహుబలి (ది కంక్లూజన్) - రాజమౌళి, ప్ర‌భాస్ కాంబినేష‌న్లో తెరకెక్కించిన ఈ సినిమా తొలివారానికి రూ.509 కోట్ల గ్రాస్, రూ.270 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు సినిమా చరిత్రలో రికార్డ్ సృష్టించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: