చలపతిరావు.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు కొన్ని దశాబ్దాలుగా పరిచయం. వందల సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేసిన నటుడు ఈయన. అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈయనకు రాని పేరు.. ఒక్క ఇన్సిడెంట్‌తో వచ్చేసింది. అదే అమ్మాయిలపై అసభ్యకరమైన కమెంట్స్ చేయడం.. రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో అమ్మాయిలు పడుకోడానికి తప్ప ఇంకెందుకు పనికిరారు అంటూ ఓ కమెంట్ అనేసాడు చలపతిరావు. దాంతో సోషల్ మీడియాలో ఈయనపై ఇష్టమొచ్చినట్లు ట్రోల్ జరిగింది.  22 ఏళ్ల వయసులో భార్య చనిపోతే మళ్లీ తాను పెళ్లి చేసుకోలేదని.. అలాంటి తనపై ఇలాంటి నిందలు వచ్చేసరికి తట్టుకోలేకపోయానని చెప్పాడు చలపతిరావు. అప్పట్లో ఈ విషయంపై ఇండస్ట్రీ అంతా ఏకమై ఈ సీనియర్ నటుడికి సపోర్ట్ చేసినా కూడా ఆయన మాటలను మాత్రం అంతా తప్పుబట్టారు. 


తెలుగు తెరపై నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలతో పాటు, ఎన్నో విభిన్నమైన పాత్రల ద్వారా చలపతిరావు ప్రేక్షకులను మెప్పించారు. నటుడిగా సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అలాంటి చలపతిరావు తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకి జరిగిన ఒక ప్రమాదాన్ని గురించి ప్రస్తావించారు.


"అది భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమా .. ఒక సీన్లో ఒక పాత బస్సుపై కూర్చుని హీరో సునీల్ తోను .. హీరోయిన్ తోను కలిసి నేను ప్రయాణం చేయాలి. ఆ సీన్ పూర్తయిన తరువాత నేను బస్సు పై నుంచి దిగబోయాను. అంతే పట్టుతప్పి అక్కడి నుంచి పడిపోయాను. నాలుగో రోజున స్పృహ వచ్చేసరికి 'అపోలో హాస్పిటల్'లో వున్నాను. కాలు .. పక్క టెముకలు .. నడుము విరిగిపోయాయి. ఒక కన్ను చూపు సరిగ్గా లేకుండా పోయింది. మూడు ఆపరేషన్ల తరువాత సరిగ్గా చూపు వచ్చింది. ఏడెనిమిది నెలల పాటు కదలకుండా బెడ్ పైనే ఉండిపోయాను. ఒక దశలో చనిపోదామనిపించింది" అని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: