బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ జనరల్ గా తనతో ఎవరన్న హీరోయిన్ తో గనక చిన్న గొడవ జరిగితే పంతానికి సేమ్ ఫీచర్స్ ఉన్న హీరోయిన్ని తన పక్కన నటింపజేస్తు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తీసుకు వస్తాడు. అలా వచ్చిన వాళ్ళే స్నేహ ఉల్లాల్, జరీన్ ఖాన్. కత్రిన డూప్ జరీన్ ఖాన్ గురించి సంగతి తెలిసిందే. కత్రిన తనకు దూరమైన క్రమంలోనే ఈ బ్యూటీని సల్మాన్ తెరపైకి తెచ్చాడు. భాయ్ సరసన వీర్ అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హేట్ స్టోరీ-3తో బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వీర్ తో పరిచయమైనా జరీన్ కు గుర్తింపును తెచ్చింది మాత్రం హేట్ స్టోరీ-3 సినిమానే. సల్మాన్ ఖాన్ చెప్పడంతో ఆ సినిమాలో నటించిన జరీన్ రీసెంట్ గా ఓ టాప్ సీక్రెట్ ని బయటపెట్టేసింది.   

ఓ ప్రముఖ దర్శకుడు లిప్ లాక్ సీన్ ప్రాక్టీస్ చేద్దామని ప్రపోజ్ చేశాడట. కెరీర్ తొలి నాళ్లలో తనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నేను బాలీవుడ్ కి కొత్త. అయినా ఆ దర్శకుడు చెప్పినట్టుగా రిహార్సల్ చేయడానికి అంగీకరించలేదని తెలిపింది.
మరో ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ని జరీన్ బయటపెట్టింది. ఇండస్ట్రీలో వున్న కొంత మందితో స్నేహానికి మించి చనువుగా వుంటే సినిమాల్లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటావని బాలీవుడ్ కి చెందిన ఓ వ్యక్తి  సలహా ఇచ్చారట. ఆ మాటల్ని కూడా తాను పట్టించుకోలేదని.. ఎవరి మాయలో పడకుండా తనని తాను కాపాడుకున్నానని చెప్పింది. కత్రినా కైఫ్ తో తనని పోలుస్తూ మీడియా వర్గాలు విమర్శలు కురిపించాయని చెప్పుకొచ్చింది. 

జరీన్ ఖాన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోని చూపిస్తూ నెటిజన్స్ ఇటీవల జరీన్ ను ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. తన ఫిజిక్ విషయంలో వల్గర్ గా కామెంట్ చేసిన వాళ్ళకి బుద్ధి చెబుతూ జరీన్ ఖాన్ కౌంటరివ్వగా తనకు అనుష్కశర్మ అండగా నిలిచింది. మరీ ఈ విషయాలన్ని సల్లు భాయ్ కి తెలీదా...పట్టించుకోలేదా అన్న కొన్ని కామెంట్స్ కూడా రివర్స్ లో జరీన్ కు పడుతున్నాయి. ఏదేమైనా సినిమా అవకాశాల పేరుతో ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు హీరోయిన్స్ ఎదుర్కోవడం చాలా బాధాకరం.



మరింత సమాచారం తెలుసుకోండి: