బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆర్.ఆర్.ఆర్. మెగా నందమూరి మల్టీస్టారర్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది.


రీసెంట్ గా బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఆర్.ఆర్.ఆర్ ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం హైదరబాద్ చేరుకుంది చిత్రయూనిట్. ఇక తర్వాత షెడ్యూల్ ఎప్పుడన్నది త్వరలో ఎనౌన్స్ చేస్తారు. ఇక ఈ సినిమా గురించి బయటకు వచ్చిన స్పెషల్ అప్డేట్ ఏంటంటే సినిమాలో కేవలం 3 సాంగ్స్ మాత్రమే ఉంటాయని తెలుస్తుంది.


సినిమాలో కొమరం భీం గా ఎన్.టి.ఆర్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్నారు. అయితే సినిమాలో రాజమౌళి ప్లాన్ ప్రకారం కేవలం 3 సాంగ్స్ మాత్రమే ప్లాన్ చేశారట. ఇక అది కాకుండా ఒకటి మోంటేజ్ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో ఒక హీరోయిన్ గా అలియా భట్ నటిస్తుండగా మరో హిరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.


బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి మాములుగానే సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉంటాయి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు రీల్ హీరోస్ రియల్ హీరోస్ పాత్రల్లో నటిస్తున్నారు. తప్పకుండా ఆర్.ఆర్.ఆర్ ఇద్దరి హీరోల అభిమానులకు పండుగ తెచ్చే సినిమా అవుతుందని చెప్పొచ్చు. 2020 జూలై 30 రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.  సినిమాలో ఇద్దరు హీరోలు తమ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కొమరం భీం గా తారక్.. అల్లూరిగా చరణ్ పోటా పోటీగా నటిస్తున్నారని తెలుస్తుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: