యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయ్యాడు. ప్రభాస్ హీరో గా నటించిన సాహో  సినిమా రెండు వారాల్లో దాదాపుగా 424 కోట్ల వసూళ్లు సాధించింది.సాహో రిలీజ్ అయిన అన్ని చోట్ల నెగిటివ్ టాక్,బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. కానీ హింది వర్షన్  సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పటి వరకు హిందీ వర్షన్ దాదాపు గా 153 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ వసూళ్లు చూస్తే బాలీవుడ్ లో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అర్థం అవుతుంది.


దంగల్ సినిమా దర్శకుడు  నితీశ్ తివారీ "రామాయణం " అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా స్ర్కీప్ట్ దశలోనే  ఉంది. ఈ సినిమాని  దాదాపు 6౦౦ కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని టాక్.  ఈ సినిమాలో రాముడిగా హృతిక్ రోషన్ మరియు సీత గా దీపికా పదుకునే నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు హాట్ టాపిక్  గా మారింది. 


ఈ సినిమాలో రావణుడి పాత్ర కోసం ప్రభాస్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారాట.ప్రభాస్ అయితే  రావణుడి పాత్రకు గాంభీర్యం మరియు అందం రెండు ఉంటాయని  ఆలోచిస్తున్నరంట. ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ కాంబినేషన్ సెట్ అయితే ప్రేక్షకులకు కన్నుల పండుగ ఖాయం.
 
ప్రభాస్  నెక్ట్స్ మూవీ కి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి "జాన్" అనే పేరును అనుకుంటున్నారు. 1960 యూరప్ బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపోందనుంది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తుంది. గోపి  కృష్ణ  మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ ఈ  సినిమాని దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్నిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: