టాలీవుడ్లోని ప్రముఖ నిర్మాతలలో ప్రసాద్ వీ పొట్లూరి ఒకరు. క్షణం, ఊపిరి, బ్రహ్మోత్సవం, రాజుగారిగది 2 సినిమాలకు పీవీపీ నిర్మాతగా వ్యవహరించారు. కొన్ని సినిమాలకు పీవీపీనే నిర్మాత కాగా మరికొన్ని సినిమాలను వేరే బ్యానర్లతో కలిసి పీవీపీ నిర్మించారు. ఈ సంవత్సరం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టైన మహర్షి సినిమాకు పీవీపీ కూడా ఒక నిర్మాతగా వ్యవహరించారు. గత నెలలో విడుదలైన అడివి శేష్ ఎవరు మూవీతో పీవీపీ నిర్మాతగా మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. 
 
2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి పీవీపీ పోటీ చేశారు. కానీ ఎన్నికల్లో పీవీపీ ఓడిపోయారు. ప్రసుతం పీవీపీ తన మేనేజర్ పై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పీవీపీకు చెందిన సంస్థలో ఒక వ్యక్తి మేనేజర్ గా పని చేస్తున్నాడు. పీవీపీ సంస్థకు చెందిన ఆర్థిక వ్యవహారాలు అన్నీ మేనేజర్ చూసుకునేలా పీవీపీ బాధ్యతలు అప్పగించాడని తెలుస్తోంది. కానీ గత కొంతకాలంగా ఆర్థిక వ్యవహారాల లెక్కల్లో తేడాలు వస్తూ ఉండటంతో పీవీపీ ఈ విషయం గురించి ఆరా తీశాడని తెలుస్తోంది. 
 
పీవీపీ మేనేజర్ దాదాపు 10 కోట్ల రుపాయల వరకు మోసం చేసాడని గ్రహించినట్లు సమాచారం. ఆ తరువాత పీవీపీ ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పీవీపీ మేనేజర్ భార్య తన భర్త కొన్ని రోజుల నుండి కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు పీవీపీ మేనేజర్ ను వెతికి పట్టుకున్నారని సమాచారం. 
 
పోలీసుల విచారణలో పీవీపీ మేనేజర్ ఆర్థిక వ్యవహారాల లెక్కల్లో తేడా జరిగిన మాట వాస్తవమేనని, మోసం చేసిన డబ్బును తిరిగి ఇచ్చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు మేనేజర్ నుండి ఈ డబ్బును రికవరీ చేస్తున్నారని సమాచారం అందుతుంది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: