టాప్ హీరోల భారీ సినిమాలకు నిడివి పెరిగి పోవడంతో ఆ నిడివిని ఎలా కుదించాలో తెలియక ఆ మూవీ దర్శకులు తెగ మధన పడిపోతారు. అయితే దీనికి భిన్నంగా ‘ఆర్ ఆర్ ఆర్’ పరిస్థితులు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ నిడివి రెండున్నర గంటలలోపే వస్తుందని సమాచారం. 

ఈమూవీలో పాటల సంఖ్య కేవలం మూడు మాత్రమే ఉండటం హీరోల ఇమేజ్ కోసం అనవసరంగా క్రియేట్ చేసిన సీన్స్ లేకపోవడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ చిన్న సినిమాగా మారుతుంది అని లీకులు వస్తున్నాయి. దీనితో చరణ్ జూనియర్ అభిమానులను సంతృప్తి పరచడానికి ఈమూవీ నిడివిని పెంచాలా లేదంటే యథాతధంగా ఈమూవీని చిన్న సినిమాగానే కొనసాగించాలా అన్న కన్ఫ్యూజన్ రాజమౌళికి కొనసాగుతున్నట్లు టాక్. 

జూనియర్ పాత్ర ఇంట్రడక్షన్ సీన్ పులి ఫైట్ తో ప్రారంభం అవుతుంది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే చరణ్ పాత్రకు సంబంధించి ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉండాలి అన్న విషయమై ఇంకా రాజమౌళి ఆలోచనలో క్లారిటీ లేదు అని అంటున్నారు. 

వాస్తవానికి ఈ సినిమాను 2020 జనవరి చివరకు పూర్తి చేయాలి అని రాజమౌళి భావించినా షూటింగ్ ప్రోగ్రస్ ఆ దిశలో జరగకపోవడంతో అనుకున్న సమయానికి మరో మూడు నెలలు ఆలస్యం అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. దీనితో గ్రాఫిక్ వర్క్స్ పూర్తి చేసుకుని ఫైనల్ కాపీ రెడీ చేసే విషయంలో ఆలస్యం జరుగుతుందని ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ రిలీజ్ డేట్ మారినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ ఏర్పడ్డ విచిత్రమైన సమస్య పై రాజమౌళి దృష్టి పెట్టి ఈమూవీ కథలో మరొక ట్విస్ట్ పెట్టి నిడివి పెంచాలా వద్దా అన్న విషయమై తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: