మాలీవుడ్ లో ఒకప్పుడు ఎన్నో సంచలన సినిమాల్లో నటించి అప్పటి స్టార్ హీరోల గుండెల్లో గుబులు రేపిన నటి షకీలా.  అప్పట్లో ఈమెను శృంగార తారగా పిలిచేవారు.  ఈమె సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే..స్టార్ హీరోల సినిమాలు సైతం పోస్ట్ పోన్ చేసుకునేవారు అంటే ఆమె సినిమాలు అంటే ఎంత క్రేజ్ ఉండేవో అర్థం చేసుకోవొచ్చు.  అలాంటి శృంగార తార కొంత కాలం తర్వాత చాలా కష్టాల్లో పడింది..ఒకదశలో సినిమా ఛాన్సులు లేని స్థితికి చేరుకున్న సమయంలో అనూహ్యంగా తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ పాత్రల్లో ఛాన్సులు వచ్చాయి. 

ఈ మద్య సంపూర్ణేష్ బాబు నటించిన ‘కొబ్బరిమట్ట’ సినిమాలో ఆయన తల్లిగా నటించింది.  తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తున్న షకీలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.    బిగ్ బాస్ షో అంటే తనకు ఇష్టముండదని చెప్పేసింది. బిగ్ బాస్ షోను తాను ఏ భాషలోనూ చూడట్లేదని వెల్లడించింది.సినీ లెజెండ్ కమల్ హాసన్ సర్ అంటే తనకు చాలా ఇష్టం కాబట్టి, శని, ఆదివారం ఆయన హోస్ట్ చేసే షోను మాత్రం చూస్తుంటానని తెలిపింది. బిగ్ బాస్ కన్నడం తొలి రెండు సీజన్లలో తాను పాల్గొన్నాను.

మూడు వారాలు కూడా వున్నాను. కానీ తనవల్ల కాలేదు. టాస్కుల్లో గెలవలేకపోయానని షకీలా వెల్లడించింది. తెలుగు బిగ్ బాస్ సీజన్‌లో భాగంగా హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే వెళతారా? అనే ప్రశ్నకు ఇలా స్పందించింది. ఎండమోల్ సంస్థ ఒకసారి తీసుకుంటే వారిని మళ్లీ తీసుకోరని అనుకుంటున్నానని తెలిపింది. ఆల్రెడీ తాను కన్నడలో చేశాను.

అయినా తనకు వెళ్లే ఆసక్తి కూడా లేదు.కొబ్బరి మట్ట సినిమాలో సంపూర్ణేష్‌తో నటించిన అనుభవాన్ని గురించి షకీలా చెప్తూ.. కొబ్బరి మట్ట షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఈ విషయం గురించి టాపిక్ వచ్చేది. సంపూర్ణేష్   తనను అమ్మా అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తాడని..అతడు చాలా మంచి వాడని అంటున్నారు. తెలుగులో ప్రసారమైన గత బిగ్ బాస్ సీజన్లలో సంపూ వెళ్లింది చూశాను, సంపూ బయటకు వచ్చింది చూశాను. మిగతా ఏవీ చూడలేదని షకీలా వెల్లడించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: