టాలీవుడ్ లోకి ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు మెగా హీరో..అల్లువారి అబ్బాయి అల్లు అర్జున్. ఈ సినిమాలో కాస్త చిన్నపిల్లవాడిలా కనిపించినా..తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేశముదురు’ సినిమాలో తన పర్ఫామెన్స్ తో నిజంగానే దేశముదురు అనిపించుకున్నాడు.  ఆ తర్వాత వచ్చిన ఆర్య,బన్ని,ఆర్య2 ఇలా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన అల్లు అర్జున్ ని టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అని పిలుస్తారు. 

బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’తర్వాత బన్నికి మంచి హిట్స్ రాలేదు.  అల్లు అర్జున్  ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ’ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో క‌థ‌ల విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. చాలా క‌థ‌లు విని ఆఖ‌రికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ క‌థ‌ను ఓకే చెప్ప‌డం తెలిసిందే. ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో కథల విషయంలో ఏమాత్రం పొరపాటు చేసినా అది కెరీర్ పై ప్రభావం చూపించేలా ఉన్నాయి. దాంతో కథాంశాలపై చాలా కేర్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు బన్ని. 

ఈ నేపథ్యంలోనే ఆర్య, ఆర్య2 లాంటి మంచి హిట్స్ ఇచ్చిన సుకుమార్ విషయంలో కూడా కథ విషయంపైనే చర్చలు నడుస్తున్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు  వేణు శ్రీరామ్‌తో ఐకాన్ మూవీ... మొత్తం మూడు సినిమాలు ఓకే చేయ‌డంతో ఫ్యాన్స్ తెగ సంతోషప‌డ్డారు.  కానీ ఇపుడు  ఆయన భారీ ప్లాన్‌కి బ్రేకులు పడ్డాయి అని వార్త‌లు వ‌స్తున్నాయి. తన సినిమా మొదలుపెట్టకుండా  మరోటి ఓకే చేసేందుకు సుకుమార్‌ ససేమిరా అన్నాడు. సుకుమార్‌ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెలల్లో లాంచ్‌ చేయాలి. ఎప్పటి నుంచి సుకుమార్ తో మూవీ చేయాల్సి ఉన్నా..పెండింగ్ పడుతూ వచ్చింది.

దాంతో డిసెంబర్ నాటికి త్రివిక్రమ్ మూవీ కంప్లీట్ చేసుకొని జనవరిలో సుకుమార్ తో మూవీ చేయాలి. ఈ నేపథ్యంలో ఐకాన్‌ సినిమాకి ఇపుడు షూటింగ్‌ కుదరదు. ఈ విషయాన్ని దిల్ రాజుకి, వేణు శ్రీరామ్‌కి ఆల్రెడీ చెప్పేశాడట బ‌న్నీ...అంతే కాదు ఈ మూవీకి బారీ బడ్జెట్ అవసరం అని కూడా చెప్పడంతో రిస్క్ ఎందుకు అని పక్కన బెట్టినట్లు సమాచారం. మొత్తానికి ఈ డైరెక్ట‌ర్ కి బ‌న్నీ హ్యాండిచ్చాడు అని ఫిల్మ్ న‌గ‌ర్‌లో జ‌నాలు చెప్పుకుంటున్నారు. కాకపోతే టాలీవుడ్ లో ఏదైనా జరగొచ్చని..అంతా ఓకే అయితే వచ్చే ఏడాది ‘ఐకాన్’ సెట్స్ పైకి కూడా రావొచ్చని కొంతమంది చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: