బిగ్ బాస్ సీజన్ 3 తొమ్మిదో వారానికి చేరుకోవడంతో నేటి నామినేషన్ ప్రక్రియ ఆసక్తిగా మారింది. ‘రంగస్థలం’ చిత్రంలోని ఆ గట్టున ఉంటావా? ఈ గట్టున ఉంటావా? అనే రంజుగా ఉండే సాంగ్‌తో మొదలైన బిగ్ బాస్ ఆట‌లో ఆసక్తికరపరిణామాలు చాలానే జరిగాయి. ముందుగా ఎవర్ని నామినేట్ చేస్తే బావుంటుందన్న దానిపై మహేష్, వరుణ్, పునర్నవిల మధ్య చర్చ నడిచింది. మనం మనం నామినేట్ చేసుకుంటున్నాము తప్పితే శ్రీముఖిని ఎవరూ నామినేట్ చేయడం లేదు. బిగ్ బాస్ డైరెక్ట్‌గా ఆమెను రెండు సార్లు నామినేట్ చేయడంతో ఎలిమినేషన్‌కి వచ్చింది తప్పితే ఆమెను మనం నామినేట్ చేయలేదని చర్చ మొదలుపెట్టారు.అయితే అలీని కూడా మనం ఇదే రీజన్‌తో నామినేట్ చేశామని ఈవారం శ్రీముఖి ఇదే కారణంతో ఎలిమినేట్ చేయొచ్చని వరుణ్ సలహా ఇచ్చారు. మహేష్ సైతం అలీని నామినేట్ చేసినప్పుడు శ్రీముఖిని కూడా చేయొచ్చని మహేష్ సలహా ఇవ్వడంతో నువ్వు సలహాలు బాగానే ఇస్తావు కాని. నీ వరకూ వచ్చినప్పుడు ఎవర్ని నామినేట్ చేస్తావో చూద్దాంలే అంటూ పంచ్ ఇచ్చింది పునర్నవి.ఇక టాస్క్ కోసం బయట టెలిఫోన్ బూత్‌ని ఇవ్వడంతో బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ఇవ్వబోతున్నాడని కంటెస్టెంట్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా బాబా భాస్కర్ ఎంటరై ఎవరు ఏం చేసినా నేను మాత్రం గెడ్డం తీయనని చెప్పేశారు. ఇక పునర్నవితో తనకు కట్ అయ్యిందని ఆమె ఫ్రెండ్ షిప్ లేదని క్లాస్‌లు పీకుతుంటే ఆమెతో నాకెందుకు అంతా ఖతమ్ అనేశాడు రాహుల్. ఆమెను డిస్ట్రబ్ చేసి నేను డిస్ట్రబ్ కాదల్చుకోలేదని కుండబద్దలు కొట్టేశాడు రాహుల్.నామినేషన్‌లో ప్రక్రియ షురూ.. త్యాగాలు ఇవిగో..ఈవారం నామినేషన్స్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో టెలిఫోన్ బూత్‌కి బిగ్ బాస్ ఫోన్ కంటెస్టెంట్స్‌తో మాట్లాడారు. మొదటిగా ఫోన్ రింగ్ కావడంతో ఆవేశంగా వచ్చి ఎప్పటిలాగే అత్యుత్సాహంగా ఫోన్ లిఫ్ట్ చేసింది శ్రీముఖి. అయితే ఆమె మొదటిగా ఫోన్ లిఫ్ట్ చేయడం వల్ల డైరెక్ట్‌గా నామినేట్ అయ్యిందని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఈ నామినేషన్ నుండి బయటపడే అవకాశాన్ని ఇచ్చారు.బాబా భాస్కర్‌ గడ్డాన్ని క్లీన్ షేవ్ చేసుకుంటే మీరు నామినేషన్ నుండి సేవ్ అవుతారని లేదంటే మీరు డైరెక్ట్‌గా నామినేట్ అవుతారని అనడంతో బాబా భాస్కర్‌కి విషయాన్ని చెప్పింది శ్రీముఖి. దీనికి బాబా భాస్కర్ ఓకే చేసి క్లీన్ షేవ్‌కి ఒప్పుకున్నారు. రాహుల్ బాబా భాస్కర్‌కి క్లీన్ షేవ్ చేసి మాస్ అవతారం నుండి క్లాస్ అవతారంలోకి తీసుకువచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: