చలపతిరావు ఎన్నో సినిమాలలో ఎన్నో క్యారక్టర్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ప్రస్తుతం చలపతిరావు వయస్సు 76 సంవత్సరాలు. అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న చలపతిరావు తన జీవితంలోని విశేషాల్ని షోలో పంచుకున్నారు. కృష్ణా జిల్లా పామర్రు దగ్గర బల్లిపర్రులో చలపతిరావు జన్మించారు. ప్రపంచంలో ఉన్న అన్ని కార్లు నడిపానని, లారీ, హెలికాఫ్టర్ ఒక సినిమా కోసం రైలు కూడా నడిపానని చెప్పాడు. 
 
19 సంవత్సరాల వయసులో బందరులో పీయూసీ చదివే సమయంలో తన క్లాస్ మేట్ పెళ్లి చేసుకుంటావా అని అడిగిందని పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో వేడుకలో చలపతిరావు మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడని వార్తలు వచ్చాయి. ఆ ఘటన గురించి చలపతిరావు మాట్లాడుతూ మహిళలను నేను చాలా గౌరవిస్తాను. 
 
సినిమాలో పనిచేసే మహిళల గురించి ఎప్పుడూ తప్పుడు మాటలు మాట్లాడటం, పరుషంగా మాట్లాడటం చేయలేదు. 22 ఏళ్ల వయస్సులో భార్య చనిపోతే నేను మళ్లీ పెళ్లి చేసుకోలేదు. అలాంటి నన్ను మహిళల గురించి ఏదో అన్నానని సోషల్ మీడియాలో ఏకేశారు. నన్ను అల్లరి పాలు చేశారని తీవ్ర మనోవేదనకు గురయ్యాను. " నన్ను ఈ విధంగా అల్లరిపాలు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు రుణపడి ఉంటాను. ఇన్నాళ్లూ నిప్పులా బతికాను. ఇక బతకనిచ్చేటట్లు లేరు " అని సూసైడ్ లెటర్ రాసి చనిపోదామనుకున్నానని చలపతిరావు చెప్పారు. 
 
సినిమాల్లో అవకాశాల కోసం మద్రాస్ వెళ్లానని ఎన్టీయార్ గారిని కలవాలన్నా కుదరకపోవటంతో ఎన్టీయార్ ను చూడటానికి వచ్చిన వాళ్లతో నేను వెళ్లానని ఎన్టీయార్ తో సినిమాల్లో వేషం కావాలని అడిగానని ఎన్టీయార్ వారం తర్వాత వచ్చి కలవమన్నాడని అలా సినిమాల్లో అవకాశం వచ్చిందని చెప్పారు. ఇప్పటివరకు 1500 సినిమాల్లో నటించానని తెలుగులో ఉన్న అందరు హీరోలతో పని చేశానని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: