వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ మూవీ ప్రమోషన్ లో యధాలాపంగా అన్న మాటలు పవన్ వీరాభిమానులకు అసహనాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా పవన్ అభిమానులు వరుణ్ తేజ్ పై గుర్రుగా ఉండటానికి ఒక కారణం ఉంది. ‘వాల్మీకి’ ప్రమోషన్ కోసం మీడియాతో మాట్లాడుతున్న వరుణ్ తేజ్ కి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 

చిరంజీవి బయోపిక్ ఎవరైనా తీయాలని భావిస్తే చిరంజీవి పాత్రకు సరైన వ్యక్తి ఎవరు అని అడగడం జరిగింది. అయితే దానికి స్పందిస్తూ వరుణ్ తేజ్ చిరంజీవి బయోపిక్ లో నటించే అర్హత సమర్థతా అన్ని విధాల రామ్ చరణ్ కు ఉన్నాయని కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు ఒకవేళ చరణ్ కు అలాంటి పాత్ర చేసే ఆసక్తి లేకపోతే తాను చిరంజీవి బయోపిక్ లో చిరంజీవిగా కనిపించడానికి రెడీ అంటూ సంకేతాలు ఇచ్చాడు. అంతేకాదు ఎవరైనా నిర్మాత ముందుకు వస్తే దర్శకుడు హరీష్ శంకర్ కు ఈ బయోపిక్ తీసే ఆలోచన ఉంది అంటూ వరుణ్ తేజ్ లీకులు ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయమే పవన్ అభిమానులకు అసహనాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. 

ఆదర్శాలలో అదేవిధంగా రాజకీయ ఆలోచనలలో చిరంజీవితో సమానంగా సినిమాలతో పాటు రాజకీయాలలో ఎదిగిన పవన్ కళ్యాణ్ చిరంజీవి పాత్రకు సరిపోడని వరుణ్ తేజ్ భావిస్తున్నాడా అంటూ పవన్ వీరాభిమానులు వరుణ్ తేజ్ ను ప్రశ్నించే అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మెగా అభిమానుల హృదయాలలో చిరంజీవి తరువాత స్థానం ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమే చెందుతుందని పవన్ వీరాభిమానులు  అభిప్రాయపడుతున్నారు. యధాలాపంగా ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలు అనుకోకుండా వరుణ్ తేజ్ కు సమస్యగా మారాయి అనుకోవాలి. ఈ కోపాన్ని పవన్ అభిమానులు ‘వాల్మీకి’ పై చూపెడితే ఈ యంగ్ హీరో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: