ప్రస్తుతం సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ తో భారీ ఎత్తున సినిమాలు రూపొందుతున్నాయి.  స్టార్ హీరోల సినిమాలు ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు, పెద్ద పెద్ద సంస్థలు ముందుకు వస్తున్నాయి.  కొన్ని సినిమాలు అంచనాలు అందుతున్నా..చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి.  అయితే చిన్న బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలు మాత్రం మంచి పేరు సంపాదించి నిర్మాతలకు కనక వర్షం కురిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఎక్కువగా కమర్షియల్ సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. 

నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, హీరోయిన్ ఎక్స్ పోజింగ్, ముద్దు సీన్లు వీటితో సరిపెడుతున్నారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం సామాజిక నేపథ్యంలో వస్తున్నాయి..అయితే వీటికి మాత్రం ఎక్కడా ఆదరణ లభించదు, అందుకే ఇలాంటి సినిమాల వైపు దర్శక, నిర్మాతలు మొగ్గు చూపించడం లేదని సినీ వర్గాల్లో టాక్.  ఇక ఆస్కార్ పురస్కారాల్లో భారత్  సినిమాలు తక్కువ అనే చెప్పాలి. భారత్ నుంచి క్రమం తప్పకుండా నామినేషన్లు వెళుతున్నా, అవార్డులు గెలుచుకోవడం ఎంతో అరుదైన విషయం.

ఒకటీ రెండు సినిమాలు మాత్రమే నామినేషన్ ఫైనల్ వరకు చేరి అక్కడ ఆగిపోతున్నాయి. తాజాగా  ఓ భారత రైతు జీవితగాథతో తెరకెక్కిన ‘మోతీభాగ్ ’అనే డాక్యుమెంటరీ మూవీ ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. ఇక ఈ కథ విషయానికి వస్తే.. హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఓ చిన్న గ్రామానికి చెందిన విద్యాదత్ శర్మ అనే రైతు సాగించిన పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం.  కొంత కాలంగా గ్రామంలో కరువు తాండవించడంతో చాలా మంది ఆ ఊరు వదిలి పట్టణాలకు వలస వెళ్తుంటారు. అయితే తాను మాత్రం ఆ ఊరిలోనే ఉంటే ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని తాపత్రయపడతాడు..ఈ నేపథ్యంలో భారత్ లో అత్యంత నాణ్యమైన రాడిష్ దుంపలు పండేది విద్యాదత్ శర్మ పొలంలో పండిస్తాడు.

భారత్ లో అత్యంత పెద్దదైన రాడిష్ దుంపను కూడా శర్మే పండిస్తాడు. ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉన్నా..కేవలం సేద్యానికే పరిమితం అవుతారు..ఇది నిజమైన కథ. విద్యాదత్ శర్మ జీవితం ఆధారంగా నిర్మల్ చందర్ దండ్రియాల్ డాక్యుమెంటరీ మూవీ తెరకెక్కించారు. ఈ ఫిల్మ్ ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిందని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. ఈ మేరకు దర్శకుడు నిర్మల్ చందర్ కు అభినందనలు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: