నాచురల్ స్టార్ నాని నిర్మాతగా రెండో ప్రయత్నం మొదలు పెట్టబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం హీరోగా మంచి ఫాంలో ఉన్న నాని నిర్మాతగా కూడా వరుస సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. అ! తో నిర్మాతగా తన టేస్ట్ ఏంటో చూపించిన నాని రెండో సినిమా కూడా ప్రయోగాత్మకంగా చేస్తాడని తెలుస్తుంది.   


ఇక నాని నిర్మాతగా చేస్తున్న సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈనగరానికి ఏమైంది.. ఫలక్ నుమా దాస్ సినిమాలతో సత్తా చాటిన విశ్వక్ సేన్ ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్ లో బాలీవుడ్ సినిమా సోను కె టిటు కి స్వీటీ రీమేక్ గా వస్తున్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని నిర్మాతగా చేస్తున్న సినిమాలో నటిస్తాడని తెలుస్తుంది. 


అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియలేదు. నిర్మాతగా నాని ఆచితూచి అడుగులేయాలని చూస్తున్నాడు. హీరోగా సూపర్ ఫాం లో ఉన్న నాని ఈ ఇయర్ ఆల్రెడీ జెర్సీ సినిమాతో హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా రిలీజైన గ్యాంగ్ లీడర్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. భలే భలే మగాడివోయ్ నుండి ఎం.సి.ఏ వరకు వరుసగా ఆరు సినిమాలు హిట్ కొట్టిన నాని లాస్ట్ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ రెండు ఫెయిల్ అయ్యాయి.


అందుకే ఈ ఇయర్ జెర్సీ హిట్ పడగానే హమ్మయ్య అనుకున్న నాని గ్యాంగ్ లీడర్ తో హిట్ ఫాం కొనసాగిస్తున్నాడు. అంతేకాదు ఇయర్ ఎండింగ్ కల్లా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న వి సినిమా రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అది రిలీజై అది కూడా హిట్టు పడితే నాని మళ్లీ హ్యాట్రిక్ హిట్ కొట్టిన వాడవుతాడు. వి సినిమాలో నాని నెగ్టివ్ రోల్ చేస్తున్నాడు. సినిమాలో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: