‘సైరా’ కలక్షన్స్ పరంగా ఏమేరకు రికార్డులు క్రియేట్ చేస్తుందో ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా ఈ మూవీ నయనతార కండిషన్స్ ను బ్రేక్ చేసిన మూవీగా ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతోంది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నయనతారకు ఇచ్చినంతగా పారితోషికం మరి ఏటాప్ హీరోయిన్ కు ఇవ్వరు. 

అంతేకాదు ఆమె కండిషన్స్ ను అన్నింటిని ఆమెతో సినిమాలు చేసే నిర్మాతలతో పాటు హీరోలు కూడ ఒప్పుకుని తీరాలి. నయనతార సూపర్ హీరోయిన్ స్టేటస్ కు ఎదిగిపోయిన తరువాత ఆమె ఎక్స్ పోజింగ్ సీన్స్ కు ఒప్పుకోకపోవడమే కాకుండా లిప్ లాక్ సీన్స్ ను కూడ చేయదు. అంతేకాదు ఆమె నటించిన ఏ సినిమా ప్రమోషన్ ఫంక్షన్ కు అదేవిధంగా ఆ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలకు ఆమె రాదు. 

ఈ విషయమై ఆమెకు అదనపు పారితోషికం ఇస్తాము అన్నా ఆమె పట్టించుకోదు. తెలుస్తున్న సమాచారం మేరకు ‘సైరా’ లో నటించే ముందు ఈ కండిషన్స్ అన్నీ ఆమె చరణ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆమె జోడీ చిరంజీవికి అన్ని విధాల సరిపోతుంది అని భావించి ఆమె కండిషన్స్ అన్నీ ఒప్పుకుని ఆమెను ‘సైరా’ కోసం బుక్ చేసుకున్నారు. అయితే షూటింగ్ స్పాట్ లో చిరంజీవి తాను నటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్ర కోసం చిరంజీవి పడిన కష్టం తపన నయనతారకు ఆశ్చర్యాన్ని కలిగించాయట.  

దీనికితోడు ఈ మూవీ షూటింగ్ స్పాట్ లో చిరంజీవి తన పట్ల చూపించిన మర్యాద గౌరవం ఆమెకు ఎంతో నచ్చి ఇప్పుడు ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆమె వస్తానని చెప్పడమే కాకుండా ఈ మూవీ ప్రమోషన్ కు సంబంధించిన ఇంటర్వ్యూలకు కూడ వస్తానని ఆమె స్వయంగా చరణ్ తో చెప్పినట్లు టాక్. దీనితో ఆనంద పడ్డ చరణ్ ఆమెకు ఈ ప్రమోషన్ కార్యక్రమాలకు సహకరించినందుకు కాను ఇప్పటికే ఇస్తున్న భారీ పారితోషికంతో పాటు నయనతారకు మరికొంత అదనపు పారితోషికం చరణ్ ముట్టచెపుతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: