టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమా రంగంలో మరో పక్క వ్యాపార రంగంలో అలాగే సామాజికంగా ప్రతి ఒక్కరికి సహాయపడుతూ కెరియర్ ని కొనసాగిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేష్ బాబు దేశ ప్రధాని పుట్టినరోజు సెప్టెంబర్ 17 వ తారీఖున శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఆయన ఎల్లప్పుడు మంచి ఆరోగ్యం మరియు ఆనందంగా ఉండి తన శక్తినంతా కూడగట్టి ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆశిస్తున్నాను అని మహేష్‌బాబు ట్వీట్ చేసారు. ప్రధాని మోడీ తన 69వ సంవత్సరంలో అడుగుపెట్టిన నేపథ్యంలో తన పుట్టిన రోజు వేడుకలను సొంత రాష్ట్రమైన గుజరాత్ లో జరుపుకున్నారు.


వరుసగా రెండుసార్లు దేశానికి ప్రధానిగా మోడీ కావడంతో సోషల్ మీడియాలో చాలామంది ప్రముఖులు మోడీకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. దీంతో మహేష్ బాబు కూడా ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో మహేష్ బాబు పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇదే క్రమంలో మహేష్ చేసిన ట్వీట్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు కూడా స్పందించారు. మీరు అందించిన ఈ వార్మ్ విషెష్ కు చాలా ధన్యవాదాలు అని నరేంద్రమోదీ గారు మహేష్ కు ట్వీట్ చేసారు.


దీంతో ఇప్పుడు ఇరువురి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది మరియు అంతర్జాతీయంగా ఉన్న నాయకులు కూడా ప్రధాని మోడీ కి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ప్రధాని మోడీ తన పుట్టినరోజు నాడు గుజరాత్ లో గాంధీ నగర్ నుంచి కేవడియా వెళ్లారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. జంగిల్ సఫారీ పార్క్, సర్దార్ సరోవర్ డ్యామ్‌ను సందర్శించారు. కేవడియాకు హెలికాఫ్టర్‌లో వెళుతూ సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇటువంటి అందమైన ప్రదేశాలను ప్రతి ఒక్కరు చూడాలి అంటూ మోడీ పేర్కొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: