సినిమా పరిశ్రమకు రావడం ఒకింత శ్రమపడాల్సి వస్తుందేమో కానీ, ఒకసారి వచ్చిన తరువాత మనకు అన్ని అంశాలు కలిసివచ్చి మంచి హిట్స్ మరియు పేరు లభిస్తే మాత్రం, మెల్లగా ఒకదాని తరువాత మరొకటి అవకాశాలు అవే తన్నుకుంటూ వస్తాయి అనడానికి ఎందరో నటీనటులు ఇప్పటివరకు సాక్ష్యాలుగా నిలిచారు. ఇక ఇటీవల ఆర్ఎక్స్ 100 అనే చిన్న సినిమాతో ప్రేక్షకుల ముదుకు వచ్చిన పాయల్ రాజ్ పుత్, ఆ సినిమా అతి పెద్ద విజయాన్ని అందుకుని ఆమెకు యూత్ లో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. 

హీరో కార్తికేయ సరసన ఆమె పోషించిన రోల్ కు థియేటర్ లోని ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక దర్శకుడు అజయ్ భూపతి కూడా ఆమె పాత్రను రొమాంటిక్ గా అలానే క్రూయల్ గా తీర్చిదిద్ది అందరిని ఆకట్టుకున్నారు. ఇకపోతే ఆ సినిమా తరువాత పాయల్ కు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక ప్రస్తుతం మాస్ రాజా రవితేజ సరసన డిస్కో రాజా, విక్టరీ వెంకటేష్ మరియు నాగ చైతన్యల వెంకీ మామ, అలానే తేజాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆర్డీఎక్స్ లవ్ అనే సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న పాయల్ కు నేడు ఒక బడా హీరో సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దొరికినట్లు సమాచారం. 

అతి త్వరలో ఒక పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పాయల్ ని తీసుకోవాలని ఆ సినిమా దర్శక నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక మరొక రెండు రోజుల్లో వారు ఆమెను కలిసి తమ సినిమా కథను కూడా వినిపించనున్నారట. అయితే ఆ స్టార్ హీరో ప్రస్తుతం ఒక సినిమాతో ఎంతో బిజీ గా ఉన్నాడని, మరికొద్దిరోజుల్లో ఈ కొత్త సినిమా కూడా ప్రారంభం అవుతుందని అంటున్నారు. నిజానికి ఆ హీరోగారే ఈ సినిమాలో పాయల్ అయితే బాగుంటుందని సలహా కూడా ఇచ్చినట్లు సమాచారం. పాయల్ కనుక హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంటే, ఆమెకు కెరీర్ పరంగా సదరు హీరోగారి సినిమా తప్పకుండా ఆమెకు మంచి బ్రేక్ ని ఇస్తుందని ఫిలిం నగర్ వర్గాల టాక్. అయితే ఆ హీరో గారు ఎవరో ఆ సినిమా ఏమిటో అనేది మాత్రం తెలియరాలేదు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: