ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మామ-అల్లుడు కలిసి నటించిన సినిమా 'వెంకీమామ'. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఎప్పటికప్పుడు గందరగోళ పరిస్థితి నెలకొంటూనే ఉంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. సినిమా చాలా రోజుల పాటు చర్చల దశలోనే ఉందన్న సంగతి కూడా తెలిసిన విషయమే. షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత కూడా అనుకున్నంత ఫాస్ట్‌గా సినిమా చిత్రీకరణ జరగలేదు. మొత్తానికి ఒక్క పాట మినహా షూటింగ్ కంప్లీట్ చేశారు. అయితే ముందుగా దసరాకు సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కాని దసరా బరిలో వెంకీ మామ ను దింపడం సాధ్య పడటంలేదని తాజా సమాచారం.

దీపావళికి అయినా సినిమాను విడుదల చేస్తారా అంటే.. ఇతర సినిమాలు ముందే కన్ఫర్మ్ అయ్యి ఉన్నాయి కనుక సేఫ్ డేట్ కోసం వెంకీ మామ టీం ఎదురు చూస్తున్నారు. క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నా కూడా ఇప్పటికే ఆ తేదీకి కొన్ని సినిమాలు డేట్స్ కన్ఫర్మ్ చేసుకొని ఉన్నాయి. ఇక సంక్రాంతికి పోటీ చాలా ఉంది. ఇలాంటి సమయంలో వెంకీ మామ సినిమాకు ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. అదే డిసెంబర్ మొదటి వారం. అంతగా పోటీ లేకపోవడం వల్ల డిసెంబర్ మొదటి వారమే బెటరని సురేష్ బాబుకు సన్నిహితులు సలహాలు ఇస్తున్నారు. 

అందుకే ఈ సినిమాని నిర్మిస్తున్న సురేష్ బాబు విడుదల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచి సమయం చూసి ఎక్కువ థియేటర్లలో సురేష్ బాబు తమ బ్యానర్ లో రూపొందే సినిమాలను విడుదల చేస్తూ ఉంటారన్న సంగతి అందరికి తెలిసిన సంగతే. అలాగే వెంకీమామ సినిమా కోసం కూడా మంచి తేదీగా డిసెంబర్ ఫస్ట్ వీక్ ను దాదాపు కన్‌ఫర్మ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పూత్ లు వెంకీ.. చైతూలకు జంటగా నటిస్తున్నారు. ఇక మజిలీతో చైతు, ఎఫ్ 2 తో వెంకీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. దాంతో అందరికి ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: