ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమా సైరా నరసింహా రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ ఈ సినిమా నిర్మించారు. బిగ్ బీ అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ బుధవారం రిలీజ్ చేశారు.  


ట్రైలర్ చూశాక సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ట్రైలర్ చూసిన మెగా ఫ్యాన్స్ కు ఓ డౌట్ వస్తుంది. నరసింహా రెడ్డి ఉరి తీసే సీన్ కూడా ఉంటుంది. అయితే అది సినిమాలో చివరి సన్నివేశమా లేక నరసింహా రెడ్డి చనిపోయాక సినిమా నడుస్తుందా అని డైరక్టర్ ను ప్రశ్న అడిగారు మీడియా వారు.  


నరసిం హా రెడ్డిని ఉరి తీసిన బ్రిటీష్ వాళ్లు 30 ఏళ్ల పాటు అలానే ఉరికంబానికి నరసింహా రెడ్డి తలను వేలాడతీశారట. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ డైరక్టర్ సురేందర్ రెడ్డి తెళ్లవాళ్లను ఎంత భయపెడితే వారు అలా చేసి ఉంటారో అని చెప్పుకొచ్చారు. అయితే సినిమా సాడ్ ఎండింగ్ తో ముగిసినా అక్కడ నుండి అసలు యుద్ధం మొదలవుతుందని హింట్ ఇచ్చాడు సురేందర్ రెడ్డి.


నరసిం హా రెడ్డి జీవితంలో జరిగిన విషాదమే ఆయన గొప్ప విజయం. ఆయన జీవితంలో జరిగింది జరిగినట్టుగా తీశామని అన్నారు సురేందర్ రెడ్డి. అమిత్ త్రివేది మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ రోల్ లో నటించింది. సినిమా ట్రైలర్ కు భారీ స్పందన రాగా సైరా మరో సెన్సేషనల్ మూవీ అవుతుందని అంటున్నారు మెగా ఫ్యాన్స్. అక్టోబర్ 2న సైరా సినిమా తెలుగు, తమిళ, హింది, మళయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: