బిగ్ బాస్ లో మహేష్ చాలా విచిత్రంగా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ విషయంలో హిమజ ప్రవర్తన గురించి ఇంటి సభ్యులందరూ చర్చించుకుంటున్నారు. హిమజ తన బట్టలు, మేకప్ కిట్లని స్టోర్ రూంలో పెడతానని చెప్పి కొన్నింటిని మర్చిపోవడంతో అనుమానాలకు తెర లేపింది. ఈ విషయమై బుధవారం బాబా భాస్కర్, రాహుల్ ల మధ్య ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది.


రాహుల్ బాబా భాస్కర్ తో మాట్లాడుతూ, హిమజ మహేష్ ని నామినేట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే తన బట్టలని కావాలనే మర్చిపోయానని వితికాతో చెప్పిందట అని అంటాడు. దీంతో ప్రేక్షకుల్లో ఒక్కసారిగా అనుమానం చెలరేగింది. ఇది నిజమా కాదా అన్న విషయం పక్కన పెడితే ఒక అనుమానం మాత్రం మొదలైంది. రాహుల్ చెప్పిన దానికి బాబా భాస్కర్ "మనం అలా నమ్మకూడదు. అది కన్ఫర్మా? కాదా అనే విషయం మనకు తెలియదు అంటాడు.


అయితే ఇక్కడ బాబా భాస్కర్ వెలిబుచ్చిన అనుమానాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే కెప్టెన్ అయిన వితికా హిమజని మహేష్ విషయంలోనే నామినేట్ చేశానని చెప్తుంది. అలాంటప్పుడు ఆమె దగ్గరికే వెళ్ళి నేను కావాలనే చేశాను అని ఎలా చెప్తుంది? ఇక పోతే గాసిప్ టాస్క్ లో వితికా హిమజని నువ్వు కావాలనే చేశావా అనే ప్రశ్న అడిగినపుడు, ఆమె చాలా క్లియర్ గా అది నేను కావాలని చేసింది కాదు. అనుకోకుండా అలా జరిగిపోయిందని చెప్తుంది.


 ఒకవేళ హిమజ నిజంగా కావాలనే చేసుంటే ఆ విషయం వితికాతో షేర్ చేసుకోదు కదా! అయితే మహేష్ విషయంలో  హిమజ వాదన ఎలా ఉన్నా ఆమె చెప్పింది ప్రేక్షకులు అంగీకరిస్తారో లేదో చూడాలి. కానీ నిజంగా ఆమె కావాలని చేసుంటే మాత్రం ఆ విషయం మరి కొద్ది రోజుల్లో బయటపడవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: