తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించి ఆ షో రేటింగ్ ని అమాంతం పెంచేసాడు. కొత్తగా మొదలైన షో కాబట్టి గొడవలు పెద్డగా జరగలేదు. దానితో షో సాఫీగా సాగింది. రెండో సీజన్  కు హోస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని హోస్టుగా వ్యహరించారు. ఆ షో రొమాన్స్ కి కేరాఫ్ గా గొడవలకు ఫ్లాట్ ఫామ్ గా మారింది. అంతేకాకుండా అందరి చేత ట్రోల్స్ కూడా వేయించుకుంది. దానితో మూడో సీజన్ కు హోస్టుగా ఆ ఇద్దరిని అడగగా ఎదో మూవీస్ ఉన్నాయి అనే సాకుతో హ్యాండ్ ఇచ్చారు. 


ఈ మూడో సీజన్ కు మిలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వారా పాపులర్ అయినా కింగ్ నాగార్జున ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. జులై 21 న ప్రారంభమైన ఈ షో మొదట్లో నత్త నడకగా సాగిన కూడా ప్రస్తుతం టాస్కులని, లవ్ అని, ఇగో లని గొడవలు మొదలయ్యాయి. ఇంకా బిగ్ బాస్ కూడా వారిని కంట్రోల్ చేయలేక పోతున్నారు అంతగా ఆ షో నడుస్తుంది. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన ఇద్దరు తమన్నా సింహాద్రి, శిల్పా చక్రవర్తి లు భూతులకు తెర  లేపారు దానితో వచ్చిన కొద్దీ రోజులకే హౌస్ నుండి బయటకు  వచ్చేసారు. 


ఇది ఇలా ఉండగా మొన్న జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ కొంచం కొత్తగా ఉన్న కూడా మరో సారి గొడవలకు తెర తీసింది. ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసుకోవాలి అని బిగ్ బాస్ చెప్పగా వారు దాన్ని తూచా తప్పక పాటించారు. ఇలా చూసుకుంటే మొదట రెండు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందనే వార్తలు వినపడుతున్నాయి. 


దూకుడు సినిమాలో ఒక సన్నివేశంలో నటించిన ప్రిన్స్ మహేష్ బాబు యాంకర్గా సెట్ అవుతాడని ఊహించిన బిగ్ బాస్ యాజమాన్యం ఈ సారి జరిగే నాల్గొవ సీజన్ కు ఆయనను హోస్ట్ గా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినపడుతుంది. ఇకపోతే టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ల స్థానం ఒకేలాగా ఉంది. కాకపోతే పవన్ హోస్ట్ గా పిలిచినా అయన ఇలాంటి చిన్న వాటికి ససేమిరా అంటారు. మహేష్ తో ఈ సీజన్ చేయాలనీ 'మా' అనుకుంటుంది మరి ఎవరు హోస్టుగా వస్తారో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: