దక్షిణాది సినిమాలో హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించుకున్న నటి సమంత. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్‌ను ఏర్పరుచుకున్నారు. అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. ఇక అక్కినేనివారి కోడలు అయిన తరవాత సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఓవైపు సినిమాలు, మరోవైపు యాడ్స్, ఇంకోవైపు ఈవెంట్స్.. ఇలా అస్సలు ఖాళీగా లేకుండా చాలా బిజీగా గడుపుతున్నారు సమంత.తన చదువుకు సంబంధించి టాలీవుడ్ బ్యూటీ, అక్కినేని కోడలు సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వాస్తవానికి ఈ క్రేజ్ అంతా ఆమెకు సినిమాల వల్లే వచ్చింది.అయితే, ఈ సినిమాల వల్ల ఆమె తన చిరకాల కోరికను నెరవేర్చుకోలేకపోయారట. ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడలో నూతనంగా ఏర్పాటుచేసిన ఏజెంట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన సమంత.. తన చదువుకు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు.ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీలో చదువుకోవాలన్నది తన చిరకాల కోరిక అని సమంత అన్నారు. సినిమాల్లో అవకాశాలు రావడంతో ఆ కోరిక నేరవేరలేదని చెప్పారు. ప్రతి ఒక్కరికీ విదేశాల్లో చదువుకోవాలనే కోరిక ఉంటుందని, దానికి అనుగుణంగా మంచి ఎడ్యుకేషన్‌ సెంటర్‌ అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారని,నా  చదువు కోసం కూడా మా అమ్మ నాన్నలు  చాల కష్టపడ్డారని  సమంత చెప్పారు.ప్రస్తుతం సమంత నటిస్తున్న రెండు చిత్రాలు  నిర్మాణ దశలో ఉన్నట్లు చెప్పారు.యువత మంచిగా చదివి తమ భవితకు బంగారు బాటలు వేసుకోవాలని సమంత  సూచించింది.తాను నటిస్తున్న 96 మూవీ నిర్మాణ దశలో ఉందని..ఈ ఏడాది ఆఖరులో సినిమా విడుదలవుతుందని చెప్పింది.



మరింత సమాచారం తెలుసుకోండి: